''తన కంటే అందంగా ఉన్నారని, బంధువుల పిల్లలను చంపిన మహిళ''

వీడియో క్యాప్షన్, ‘‘తన కంటే అందంగా ఉన్నారని, బంధువుల పిల్లలను చంపిన మహిళ’’
''తన కంటే అందంగా ఉన్నారని, బంధువుల పిల్లలను చంపిన మహిళ''

పూనమ్ మొదట తన తొమ్మిదేళ్ల మేన కోడలిని నీటి ట్యాంక్‌లో ముంచి చంపారు. అనుమానం రాకుండా ఉండటానికి, తన మూడేళ్ల కొడుకును కూడా అదే ట్యాంక్‌లో ముంచి, ప్రమాదంగా నమ్మించారని పోలీసులు చెప్పారు.

ఆగస్టు 2025లో సేవా గ్రామంలో పూనమ్ తనకు వరుసకు సోదరుడైన వ్యక్తి ఆరేళ్ల కుమార్తెను కూడా ఇదే తరహాలో నీటిలో ముంచి హత్య చేశారు.

"బంధువులు ఈ మూడు సంఘటనలను ప్రమాదవశాత్తు జరిగినవిగా భావించారు. వారికి ఎటువంటి అనుమానం రాలేదు. కేసు నమోదు చేయలేదు" అని పోలీసులు తెలిపారు.

పూనమ్ బాలికలను చంపడానికి గల కారణాన్ని ఎస్పీ భూపేంద్ర సింగ్ వివరిస్తూ, "ఆమె అందమైన అమ్మాయిలను ద్వేషిస్తుంది" అన్నారు.

హరియాణా, హత్య, అందం

ఫొటో సోర్స్, Vinit Kumar

ఫొటో క్యాప్షన్, తనకంటే అందంగా ఉన్నారని బంధవుల పిల్లలను చంపిన మహిళ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)