‘బ్యాట్‌తో షాట్ కొట్టగానే భారీ శబ్దంతో ఆ బంతి పేలిపోయింది.. ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే పడిపోయారు’

వీడియో క్యాప్షన్, బాంబుల మధ్య బాల్యం
‘బ్యాట్‌తో షాట్ కొట్టగానే భారీ శబ్దంతో ఆ బంతి పేలిపోయింది.. ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే పడిపోయారు’

1996 మే నెలలో మండు వేసవిలో ఒక ఉదయం పూట పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ మురికివాడకు చెందిన ఆరుగురు బాలురు ఇరుకైన సందులో క్రికెట్ ఆడటానికి బయటికి వచ్చారు.

జోధ్‌పూర్ పార్కు సమీపంలోని బస్తీలో సందడి వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆ రోజు సెలవు.

ఆ పిల్లల్లో ఒకరైన 9 ఏళ్ల పుచు సర్దార్, నిద్రపోతున్న తన తండ్రిని దాటుకుని నిశ్శబ్దంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుని బయటికి వచ్చాడు. ఆ తరువాత బంతిని బ్యాటుతో కొట్టిన శబ్దం ఆ వీధి అంతా వినిపించింది.. ఇంతకీ ఏం జరిగింది? ఆ తరువాత పుచు జీవితం ఎలా మారింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో..

Children of bombs

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)