గ్రీన్‌ల్యాండ్ ఆదివాసీ మహిళలు: ‘నా అనుమతి లేకుండానే నాకు గర్భం రాకుండా చేసేశారు.. ప్రతీసారి నెలసరి వచ్చినా గర్భవతి అయ్యే దాన్ని కాదు’
గ్రీన్‌ల్యాండ్‌లోని ఆదివాసీ మహిళలపై కొన్నేళ్లుగా రహస్యంగా చేపడుతున్న జనాభా నియంత్రణ పద్దతులపై రెండేళ్ల విచారణకు డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ అంగీకరించాయి.
1960, 70ల నుంచి వేల మంది ఆదివాసీ మహిళలు, బాలికలకు రహస్యంగా గర్బ నిరోధక సాధనాలు అమర్చారు.
అయితే ఈ పద్దతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని బీబీసీ ప్రతినిధి ఎలేన్ జుంగ్ పరిశోధనలో తేలింది.
ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది.
డెన్మార్క్ జనాభా నియంత్రణ కుంభకోణంపై గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ ప్రభుత్వాలు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాయి.
1960ల మధ్య నుంచి 70 ఆరంభం సమయంలో.. కనీసం 4500 మంది మహిళలకు గర్భాశయంలో గర్భినిరోధక పరికరాలు అమర్చారు.
యువతుల్లో కూడా.. వారి నుంచి లేదా కనీసం వాళ్ల తల్లిదండ్రుల నుంచైనా అనుమతి లేకుండా ఇలా చేశారు.
డెన్మార్క్ సామ్రాజ్యంలోని ఈ దేశంలో జరుగుతున్న ఈ చీకటి అధ్యాయం వివరాలు ఈ ఏడాదే బయటపడ్డాయి.
అప్పటికే చాలా మంది గర్భవతులపై ఇది తీవ్ర ప్ర భావాన్ని చూపించింది. ఈ కుటుంబాలు ఏడుగురు నుంచి ముగ్గురు పిల్లలు కలిగి ఉండేవి.
చిన్న గ్రామాల్లాంటి ప్రదేశాల్లో, జననాు రేటు దాదాపుగా కనుమరుగైంది. ఆ సమయంలో పిల్లలు పుట్టలేదు. ఇదసలు ఎలా జరిగిందో అర్ధం కాలేదు.
ఇప్పుడు చైతన్యం రావడంతో మహిళలు మాడ్లాడుతున్నారు. తమకు న్యాయం చేసే సమాధానాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మహిళలు అప్రమత్తంగా ఉంటూ మాట్లాడుతున్నారు. కానీ న్యాయాన్ని కోరుకుంటూ వాటి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: 'అమ్మాయిలు సైకిల్ తొక్కడం ‘అశ్లీలం’, మత సంప్రదాయాలకు విరుద్ధం'
- ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ 2022: చివరి దశకు పోరు.. అర్జెంటీనాను మెస్సీ ఫైనల్స్‌కు తీసుకెళ్తాడా
- ఇండియా, చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ.. రెండు దేశాల సైనికులకూ గాయాలు
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి
- కే-పాప్ వర్చువల్ గర్ల్స్: ఆడతారు, పాడతారు, అభిమానులతో ముచ్చటిస్తారు.. కానీ, అసలైన అమ్మాయిలు కారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



