రోడ్డుపై ప్రసవించిన ఆదివాసీ మహిళ
రోడ్డుపై ప్రసవించిన ఆదివాసీ మహిళ
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రభుత్వ అంబులెన్స్ రాకపోవడంతో ఓ ఆదివాసీ మహిళ రోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా బోర్మాలీ గ్రామంలో జరిగింది.
అంబులెన్స్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్నోసార్లు ఫోన్ చేశామని, కానీ రాలేదని మహిళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక ఆమెను భర్త మోటారు సైకిల్‌పై తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా, దారిలోనే ఆమెకు నొప్పులు వచ్చి, రోడ్డుపక్కనే ప్రసవించింది.
స్థానిక మహిళలు ప్రసవానికి సాయపడ్డారు. కానీ, బొడ్డు తాడును కత్తిరించే సమయంలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన స్థానికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









