ఇజ్రాయెల్: న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న యుద్ధవిమానాల పైలట్లు
ఇజ్రాయెల్: న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న యుద్ధవిమానాల పైలట్లు
ఇజ్రాయెల్ సుశిక్షత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ పైలట్లు .. శిక్షణకు హాజరు కాకూడదనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికపై వ్యక్తమవుతోన్న వ్యతిరేకతకు మద్దతిస్తూ ఆందోళనల్లో పాల్గొంటామన్నారు.
బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలోని జాతీయ- మతవాద సంకీర్ణ కూటమి న్యాయవ్యవస్థలో సమూల మార్పులు చేయాలని తలపెట్టింది.
అయితే ప్రజలతో పాటు పైలట్లు, 8200 ఇంటెలిజెన్స్ యూనిట్‌లోని శిక్షకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ సంస్కరణల వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలుగుతుందని, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని వారంటున్నారు.
బీబీసీ ప్రతినిధి మైక్ థాంప్సన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



