You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వియత్నాం: అంతర్జాతీయంగా ఈ దేశానికి ఎందుకు ప్రాధాన్యం పెరుగుతోంది... ఇది అక్కడి కమ్యూనిస్టు నాయకత్వానికి ఆందోళనకరంగా మారిందా?
- రచయిత, జొనాథన్ హెడ్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచ దేశాల్లోనే వియత్నాం ప్రస్తుతం స్పాట్‌లైట్‌లో ఉంది.
ఒకప్పుడు ప్రపంచానికి అంతగా పరిచయం లేని నాయకు వ్యూహాల నీడలో నడిచిన వియత్నాం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు గత ఏడాది వియత్నాంలో పర్యటించారు.
అమెరికా, వియత్నాంల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. వియత్నాంను తమ “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి”గా చెప్పింది అమెరికా.
వియత్నాం మొత్తంగా 18 అమలులో ఉన్న లేదా ప్రణాళికకు సిద్ధం అవుతున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలకు అంగీకారం తెలిపింది.
వాటిలో వాతావరణ మార్పు, కోవిడ్ వంటి మహమ్మారులను ఎదుర్కొనేలా ముందస్తు సన్నద్ధం వంటి ఒప్పందాలు వాటిలో ఉన్నాయి.
దక్షిణ చైనా సముద్రతీరంలో చైనా, అమెరికాల మధ్య నెలకొన్న పోటీలో వియత్నాం కీలకమైన ప్రాంతీయ భాగస్వామి.
ఔట్‌సోర్సింగ్ మాన్యుఫాక్చరింగ్ సేవల విషయంలో చైనాకు చక్కటి ప్రత్యామ్నాయం.
అయితే, కాలానుగుణంగా మార్పులు వస్తున్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో ఉన్న దేశంలో మాత్రం ఇప్పటికీ అధికారం, రాజకీయపరమైన అంశాల్లో మాత్రం పాలకులు వెనక్కి తగ్గడంలేదు.
విదేశీ శక్తుల ప్రమేయం పట్ల అనుమానాలు..
ప్రపంచంలోని ఐదు కమ్యూనిస్ట్ దేశాల్లో వియత్నాం ఒకటి. తొలి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం అధికారంలో ఉంది. అక్కడ ప్రతిపక్షమనేదే లేదు. అసమ్మతి స్వరం వినిపించేవారు, తిరుగుబాటు దారులపై అణిచివేత ఈమధ్య కాలంలో మరింత పెరిగింది.
రాజకీయ నిర్ణయాలన్నీ పార్టీలోని ఉన్నతస్థాయి నేతల చేతుల్లోనే ఉంటాయి. నిర్ణయాల అమలులో వారు అత్యంత గోప్యత పాటిస్తారు.
కొద్దివారాల క్రితం వియత్నాంలోని అత్యున్నత శాసనసభ సెంట్రల్ కమిటీ పోలిట్‌బ్యూరోకు సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్ బహిర్గతమైంది. అందులో, అంతర్జాతీయ భాగస్వామ్యం, అంతర్జాతీయ సంబంధాలపై పార్టీలోని అత్యున్నత నాయకుల వైఖరిని స్పష్టంగా తెలియజేసే విషయాలు ఉన్నాయి.
'డైరెక్టివ్24' గా చెబుతున్న ఈ పత్రాన్ని వియత్నాంపై అధ్యయనం చేస్తున్న మానవ హక్కుల సంస్థ ప్రాజెక్ట్-88 సంపాదించింది. వివిధ పార్టీ ప్రచురణల్లో పేర్కొన్న ప్రస్తావనలను బట్టి చూస్తే, ఇది నిజమైనదేనని అర్థమవుతోంది.
గత ఏడాది జులైలో దీనిని జారీ చేశారు. అందులో అంతర్జాతీయ సంబంధాలు పెరుగుతున్న కారణంగా దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కాక, ప్రతికూల, వ్యతిరేకశక్తుల ప్రభావం గురించి, వాటి విషయంలో అవలంబించాల్సిన విధానంపై కొన్ని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి.
ఆ పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, “అంతర్జాతీయ శక్తుల ప్రభావంతో దేశంలో అంతర్గత రాజకీయాల్లో మార్పులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు మొదలయ్యే ఆస్కారం ఉంది. ఇక్కడివారు పౌర సమాజం, స్వతంత్ర యూనియన్లతో పొత్తులు ఏర్పరచుకుని సంబంధాలు కొనసాగిస్తారు. అంతర్గత రాజకీయ వ్యతిరేక సమూహాల ఏర్పాటు కోరుతూ డిమాండ్‌లు మొదలవుతాయి”అని ఉంది.
డైరెక్టివ్24లో రక్షణ అంశంలో కఠినంగా ఉండటంతోపాటు అంతర్జాతీయ ప్రభావాలకు వ్యతిరేకంగా ఉండాలని అన్నిస్థాయిల్లో ఉన్న పార్టీ అధికారులను కోరుతున్నట్లుగా ఉంది.
అంతేకాకుండా, “వియత్నాం ఆర్థికంగా విజయాలు నమోదు చేసినప్పటికీ, ఆర్థికవ్యవస్థలో భద్రత, ఫైనాన్స్, కరెన్సీ, విదేశీ పెట్టుబడులు, శక్తి వనరులు, ఉపాధి వంటి అంశాల్లో బలంగా లేదు.. విదేశాలపై ఆధారపడటమనేది సున్నితమైన అంశం. అది ముప్పుగా పరిణమించవచ్చు”
అందులో ప్రస్తావించిన అంశాలు హెచ్చరికలతో కూడినవి.
వియత్నాం ప్రభుత్వం చేసిన బహిరంగ ప్రకటనల్లో ఎన్నడూ అభద్రతను వ్యక్తం చేయలేదు.
అయితే, ఈ పత్రంలో ఉన్న అంశాల అర్థమేంటి?
డైరెక్టివ్ 24లో ఏముంది?
డైరెక్టివ్ 24 పత్రం మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాలకు వ్యతిరేకంగా, వారి పట్ల మరింత కఠినంగా వాటి పట్ల వ్యవహరించాలని చెప్పేలా ఉందని ప్రాజెక్ట్ 88 కో డైరెక్టర్ బెన్ స్వాంటన్ అన్నారు.
తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాలో పర్యవేక్షణ, స్వతంత్ర రాజకీయ సంస్థల ఏర్పాటును అనుమతించకపోవడం, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు పెరగడాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలే కాకుండా “వివక్ష వ్యతిరేక ఉద్యమాలు”, “ప్రజా ఉద్యమాలు”సహా తొమ్మిది ఆదేశాల గురించి స్పష్టంగా పేర్కొంది.
“వారు అసలు రంగును బయటపెట్టారు” అన్నారు బెన్ స్వాంటన్.
“మానవహక్కులను రాజకీయ సమస్యగా చూసి, వాటిని ఉల్లంఘించాలని పార్టీలోని వారికి సమాచారం ఇస్తున్నారు ” అన్నారు.
అయితే, అందరూ బెన్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు.
“డైరెక్టివ్ 24 అనేది ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్య వాదులు, పౌర సమాజ కార్యకర్తలపై అణిచివేతపై కొత్త సంకేతమేమీ కాదు. కానీ, కార్యకర్తలపై అణిచివేత నిరంతరం కొనసాగుతుందని చెప్తోంది” అన్నారు.
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీలోని ఎమెరిటస్ ఆఫ్ పాలిటిక్స్ ప్రొఫెసర్, వియత్నాంపై అవగాహన ఉన్న నిపుణులైన కార్లైల్ థాయర్.
అమెరికా, వియత్నాంల భాగస్వామ్యంపై అంగీకారం తెలిపిన సమయంలో, అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వియత్నాం పర్యటనకు రెండు నెలల ముందు ఈ డైరిక్టివ్24 జారీ అయిందని అన్నారు థాయర్.
కోవిడ్, చైనా ఆర్థిక మందగమనం ప్రభావాలను ప్రత్యక్షంగా చూశాక, 2045 నాటికి అభివృద్ధి చెందిన అత్యధిక ఆదాయ దేశంగా నిలవాలన్న తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతామనే ఆ పార్టీ భయమే ఈ నిర్ణయానికి కారణమని థాయర్ అన్నారు.
ఆర్థిక స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాలంటే అమెరికాతో దగ్గరి సంబంధాలు అవసరం.
అమెరికా వైఖరి వియత్నాంలో ప్రజాస్వామ్య అనుకూల భావాలను ప్రోత్సహిస్తుందని, అది దేశంలో అధికారంపై పార్టీ గుత్తాధిపత్యానికి ముప్పు తెస్తుందని పార్టీలోని బలమైన శక్తులు ఆందోళన చెందుతున్నాయి.
డైరెక్టివ్24లో వినియోగించిన భాష అలాంటి పరిస్థితులు చోటు చేసుకోవని పార్టీలోని బలమైన వర్గాలకు భరోసా ఇచ్చేందుకే ఉద్దేశించినదని అభిప్రాయం వ్యక్తం చేశారు థాయర్.
వియత్నాంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నేత, ప్రముఖ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త జనరల్ సెక్రటరీ న్గుయెన్ ఫు ట్రోంగ్ వ్యక్తిగత సంతకం ఉన్న డైరెక్టివ్4 ఆ ఆదేశాల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తుందని ప్రొఫెసర్ అన్నారు.
నేతల్లో సందిగ్ధత...
ప్రపంచ వాణిజ్య, తయారీ కేంద్రంగా వియత్నాం మారడంతో అక్కడి కమ్యూనిస్ట్ నేతల్లో నెలకొన్న సందిగ్ధతను తెలిపేలా డైరెక్టివ్ 24 ఉంది.
చైనా ‘గ్రేట్ ఫైర్‌వాల్’గా మారేందుకు అమలు చేసిన వ్యూహాల స్థాయిలో వియత్నాం చేయలేదు. అందుకు పరిమితులు ఉన్నాయి.
వియత్నాంలో ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతికత రెండూ అవసరం.
అంతేకాకుండా, వియత్నాం సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఒకటి 2020లో యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చున్న ఒప్పందం. అందులో శ్రామిక హక్కులకు సంబంధించిన నింబంధనలూ ఉన్నాయి.
వియత్నాంలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనేషన్ (ఐఎల్‌వో) వాటిలో కొన్నింటిని ఆమోదించింది. అయితే, డైరెక్టివ్24ను పరిశీలిస్తే, ఆ నిబంధనలకు అంగీకారం తెలిపేందుకు సిద్ధంగా లేదని అన్నట్లుగా ఉంది.
అందులో, స్వతంత్ర యూనియన్ల పరిమితులను కూడా పార్టీ స్పష్టంగా పేర్కొంది.
మరోవిధంగా చెప్పాలంటే ఐఎల్‌వోతో సహకారానికి అంగీకరిస్తూనే, పార్టీ నియంత్రణలో లేని ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిరాకరిస్తోంది.
వియత్నాం పాశ్చాత్య దేశాల భాగస్వామ్యానికి అంగీకారం తెలుపుతూ, ఒప్పందాలను సమర్ధిస్తున్నపట్టికీ, మానవ, శ్రామిక హక్కుల విషయంలో సొంత వైఖరినే కలిగి ఉందని, వ్యక్తిగత హక్కులను గౌరవించలేని రాజకీయ వ్యవస్థతో పాశ్చాత్య దేశాలు ఒప్పందాలు చేసుకున్నట్లు గుర్తించాలనేది బెన్ స్వాంటన్ వాదన.
పశ్చిమ దేశాల ప్రభుత్వాలతో వియత్నాం ’జస్ట్ ఎనర్జీ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్’ కుదుర్చుకున్న సమయంలో ఆరుగురు పర్యావరణవేత్తలను ఆ దేశం ఖైదు చేసిన సంగతి గుర్తు చేశారు బెన్ స్వాంటన్.
అలాంటి దేశంలో, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అమలుపై పర్యవేక్షణ అవసరమని అన్నారు.
చాలా దశాబ్దాల క్రితం మార్కిస్ట్-లెనిస్ట్ దేశాలదే భవిష్యత్తు అని అంతా భావించారు. ప్రపంచంలో నిరుపేద వర్గాల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి.
కానీ, ఇప్పుడు అది కనిపించడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే చైనాను రాజకీయ నమూనాగా చూస్తారు. చైనా సాధించిన ఆర్థిక విజయాలను ప్రశంసిస్తారు.
మొత్తంగా వియత్నాం ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగిస్తూ అభివృద్ధి సాధించాలని భావిస్తోంది. అంటే, ఇప్పటివరకూ ప్రజల మీదున్న కఠినమైన నియంత్రణనను కొనసాగిస్తూనే వారిని కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా ముందుకు వచ్చేలా ప్రేరేపించాలని అనుకుంటోంది. ఆ విధంగా దేశ ఆర్థికవ్యవస్థను విస్తరించాలని ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- సానియా మీర్జా: ‘మహిళల విజయాలను గుర్తించడంలో సమాజం వైఖరి ఎప్పటికీ మారదా?’
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?
- శ్రీశైలం: దట్టమైన నల్లమల అడవిలో వేలమంది జరిపే ఈ యాత్ర ఏంటి, ఎలా సాగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)