పాకిస్తాన్: బతుకు బాగుపడాలని పడవెక్కారు.. నడిసముద్రంలో మునిగిపోయారు

వీడియో క్యాప్షన్, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే వలసలకు కారణమంటున్న నిపుణులు
పాకిస్తాన్: బతుకు బాగుపడాలని పడవెక్కారు.. నడిసముద్రంలో మునిగిపోయారు

మెరుగైన జీవితాలకు ఆశపడి బోటులో అక్రమంగా యూరప్ చేరుకోవాలనే ప్రయత్నంలో 60 మందికి పైగా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణ ఇటలీ సమీపంలోని సముద్రజలాల్లో వారి పడవ మునిగిపోయింది. మృతుల్లో ఒక పసిబిడ్డ, ఇద్దరు కవలలు సహా మొత్తం 12 మంది చిన్నారులున్నారు.

ఆ బోటులో మొత్తం ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలీదు కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది.

తుర్కియే నుంచి బయలు దేరిన ఈ పడవలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సొమాలియాకు చెందిన వారున్నారు.

బీబీసీ ప్రతినిధి విన్సెంట్ మెక్‌అవినేయ్ అందిస్తున్న కథనం.

ఇటలీ వద్ద మునిగిన పడవ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)