జావా: ఆ అగ్నిపర్వతం దగ్గర ‘నైవేద్యం’ సమర్పిస్తారు
జావా: ఆ అగ్నిపర్వతం దగ్గర ‘నైవేద్యం’ సమర్పిస్తారు
అగ్నిపర్వతం పేలినపుడు, దాని చుట్టుపక్కల ప్రజలు వణికిపోతారు. దూరంగా వెళ్లిపోవడానికి పరుగులు పెడతారు. కానీ, ఈ పొగలు కక్కే అగ్నిపర్వతం దగ్గరకు వేల మంది ప్రజలు స్వయంగా వెళతారు. చాలా ఎత్తున్న ఒక పర్వతాన్ని ఎక్కి మరీ వారు ఇక్కడకు వస్తున్నారు.
ఇది ఇండోనేషియాలోని జావాలో ఉన్న మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం. ప్రజలు సజీవంగా ఉన్న ఈ అగ్నిపర్వతం అంచుల దగ్గరకు వెళ్లి, తమ పశువులను, పండ్లు, కూరగాయలను నైవేద్యంగా అందులో వేస్తారు.
టేంగడ్ సముదాయానికి చెందిన వీళ్లు.. శతాబ్దాల నాటి తమ సంప్రదాయ పండుగను జరుపుకోడానికి ఈ అగ్నిపర్వత బిలం దగ్గరకు వస్తుంటారు. ఈ పండుగను యదన్యా కసాదా అంటారు.
ఈ పండుగ తమ జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకొస్తుందని వీరి విశ్వాసం.

ఇవి కూడా చదవండి:
- హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ రహస్య సైనిక స్థావరంలో 20 నెలలుగా ‘నరకం’ అనుభవిస్తున్న తమిళులు
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?
- కొలంబియా అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు... అడవే వారిని కాపాడిందా?
- భారత్లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



