పాకిస్తాన్ మీద ఇరాన్ మిసైల్ దాడి ఎందుకు చేసింది?

వీడియో క్యాప్షన్, మాల్దీవులు: మహమ్మద్ ముయిజ్జూ చైనాకు వెళ్ళి వచ్చాక ఎందుకిలా మారారు?
పాకిస్తాన్ మీద ఇరాన్ మిసైల్ దాడి ఎందుకు చేసింది?

పొరుగునే ఉన్న ఇరాన్ మంగళవారం తమ దేశంపై జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని పాకిస్తాన్ చెప్పింది.

పాకిస్తాన్‌లోని ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన రెండు స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇరాన్ చెప్పినట్లు ఇరాన్ సైన్యానికి అనుబంధంగా పనిచేసే ఓ వార్తాసంస్థ తెలిపింది.

ఇరాన్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్, ‘‘ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఇలాంటిది తీవ్ర పర్యవసానాలకు దారి తీయొచ్చు’’ అని పేర్కొంది.

పాకిస్తాన్ కంటే ముందు ఇరాన్ గత కొద్ది రోజులలో సిరియా, ఇరాక్‌లపైనా దాడులు చేసింది.

పాకిస్తాన్‌పై ఇరాన్ ఇలా క్షిపణి దాడి చేయడం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు.

ఇరాన్ దాడులను పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.

‘‘మా వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తమ గగనతలంలో ఇరాన్ ఉల్లంఘనలకు పాల్పడింది’’ అంటూ పాకిస్తాన్ పేర్కొంది.

ఇరాన్‌ది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చర్య అని పాకిస్తాన్, ఇరాన్ మధ్య కమ్యూనికేషన్‌కు అనేక మార్గాలున్నప్పటికీ అక్రమంగా ఇలాంటి చర్యలకు దిగడం ఆందోళన కలిగిస్తోందని పాక్ తన ప్రకటనలో పేర్కొంది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)