ఆకలి బాధతో కన్న కూతుళ్ళను అమ్ముకుంటున్నారు

వీడియో క్యాప్షన్, ఆకలి బాధతో ఆడపిల్లలను అమ్మేసుకుంటున్నారు
ఆకలి బాధతో కన్న కూతుళ్ళను అమ్ముకుంటున్నారు

అఫ్గానిస్తాన్ తాలిబాన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత ఇది రెండవ చలి కాలం. అఫ్గాన్ ప్రజలకు ఈ చలిని తట్టుకుని మనుగడ సాగించడమే పెను భారంగా మారింది.

బతికుండేందుకు తమ కూతుళ్లను కూడా అమ్ముకుంటున్నారు. అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రస్తుత పరిస్థితులను ఐక్యరాజ్య సమితి పెను విపత్తుగా చెబుతోంది. లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

పోషకాహార లోపంతో బాధపడే పిల్లల సంఖ్య దాదాపుగా 50 శాతానికి పెరిగింది. ఆకలితో ఉన్న తమ పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తు బిళ్లలను వేస్తున్నట్లు కొంతమంది తల్లిదండ్రులు బీబీసీతో చెప్పారు.

బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తోన్న ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.

అఫ్గానిస్తాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)