15 మంది ఎమర్జెన్సీ వర్కర్లను ఇజ్రాయెల్ చంపడంపై స్వతంత్ర, అంతర్జాతీయ దర్యాప్తు జరపాలి - రెడ్ క్రెసెంట్
దక్షిణ గాజాలో రెండు వారాల క్రితం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పదిహేను మంది అత్యవసర సహాయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణ జరపాలని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సంస్థ డిమాండ్ చేస్తోంది.
ఇజ్రాయెల్ బలగాలు ఉద్దేశపూర్వకంగానే తమ సిబ్బందిని చంపాయని రెడ్ క్రెసెంట్ సంస్థ ఆరోపిస్తోంది.
అయితే ఈ దాడి జరిగిన మొదటి క్షణాల్లో ఏం జరిగిందనేదానిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది.
ప్రాణాలు కోల్పోయిన పదిహేను మంది అత్యవసర సిబ్బంది మృతదేహాలను వెలికితీయడానికి రెండు వారాల సమయం పట్టింది. రెండు వారాల క్రితం దక్షిణ గాజాలో ఈ దాడి జరిగింది.
మృతులను సామూహికంగా ఖననం చేశారు. వారితో పాటే దాడిలో దెబ్బతిన్న వాహనాలనూ పూడ్చిపెట్టారు.
కాన్వాయ్‌పైన దాడి చేసి తమ సైనికులు తప్పు చేశారని ఇజ్రాయెల్ అంగీకరించింది.
కానీ గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడిన ఆరోపణలను మాత్రం తిరస్కరిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters









