మనుషులు, జంతువుల్లానే రాళ్లు కూడా ఎత్తు పెరుగుతాయా?
మనుషులు, జంతువుల్లానే రాళ్లు కూడా ఎత్తు పెరుగుతాయా?
రాళ్లు పెరుగుతాయా అనే ప్రశ్న మనలో చాలామందికి తలెత్తుతుంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల రాళ్లు పెద్దవవుతున్నట్లుగా చెప్పుకోవడం వింటుంటాం.
కాల్షియం కార్బోనేట్ ఉన్న నీరు గుహలపై నుంచి నేలపైకి పూర్తిగా జారిపోకుండా గుహ ఉపరితలానికి అతుక్కుని అక్కడి నుంచి పొరలు పొరలుగా ఏర్పడి చివరకు దిబ్బల్లా పెరుగుతాయి. వీటినే స్టాలాక్లైట్స్ అంటారు.
ఈ రకమైన పెరుగుదల చాలా నెమ్మదిగా వేలాది సంవత్సరాల పాటు జరుగుతుంది. అరకు సమీపంలోని బొర్రా గుహల్లో ఇది కనిపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









