డయాబెటిస్ ఉన్నవారు HbA1C టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి?
HbA1C పరీక్షను A1C పరీక్ష లేదా గ్లైకేటేడ్ హిమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ A1C పరీక్ష అని కూడా పిలుస్తారు. రక్తంలో గ్లూకోజ్ అంటుకొని ఉన్న హిమోగ్లోబిన్ ప్రోటీన్ మొత్తాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
గత 3 నెలలు (8 నుంచి 12 వారాలు)గా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని HbA1C సూచిస్తుంది. అంటే నిన్న, మొన్న తిన్న ఆహారం వల్ల కాకుండా, గత మూడు నెలలుగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో షుగర్ శాతం ఎంత ఉందో తెలుపుతుంది.
ఈ పరీక్ష డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించడానికి, అలాగే షుగర్ ముందు స్టేజీ (ప్రీ-డయాబెటిస్), షుగర్ (మధుమేహం/డయాబెటిస్)ని గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది.
ఈ పరీక్షకు ఉపవాసం ఉండాల్సిన పనిలేదు. తినే ఆహారంతో నిమిత్తం లేకుండా రోజులో ఎప్పుడైనా ఈ పరీక్ష చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









