ఎర్ర సముద్రంలో హూతీలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయా?

వీడియో క్యాప్షన్, యెమెన్ హూతీలకు, ఇజ్రాయెల్‌కు మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఎర్ర సముద్రంలో హూతీలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయా?

పశ్చిమాసియా సంఘర్షణలో యెమెన్‌కు చెందిన హూతీల పేరు ఏడాది కాలంగా తరచూ వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌ లక్ష్యంగా క్షిపణులను, డ్రోన్‌లను ప్రయోగించిన ఈ రెబెల్స్... ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కూడా అనేకసార్లు దాడులకు పాల్పడ్డారు.

ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలు యెమెన్‌లో హూతీ స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ గ్రూపును అమెరికా ఇదివరకే టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. మరి అంతర్జాతీయ ప్రయత్నాలు హూతీల ఆశయాలకు అడ్డుకట్ట వేస్తాయా? లేదా యెమెన్‌ ఒక విస్తృత యుద్ధంలో మరింత లోతులో కూరుకుపోతుందా? బీబీసీ స్పెషల్ స్టోరీ.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హూతీలు

ఫొటో సోర్స్, EPA