బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకెళ్లిన బస్సు

వీడియో క్యాప్షన్, బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు
బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకెళ్లిన బస్సు

సిన్నర్ డిపోలో ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్నవారిపైకి బస్సు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో దాపుర్ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

MH 13 CU 8267 నంబర్ బస్సు ఉదయం 11 గంటలకు దేవపూర్‌కు బయలుదేరాల్సి ఉంది. 10.45 గంటల సమయంలో డ్రైవర్ బస్సును డిపో నుంచి ప్లాట్‌ఫామ్‌ దగ్గరికి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిలవడంతో డ్రైవర్ బస్సుని అదుపుచేయలేక పోయారు. దీంతో బస్సు ఆగకుండా ప్లాట్‌ఫారంపైకి దూసుకెళ్లింది.

ఈ కేసులో బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని బాలుడి బంధువులు డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర, బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)