షీలాకౌర్: ఈమెకు 60వ ఏట ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, ఎందుకంటే..
దిల్లీలోని తిలక్ విహార్ విడో కాలనీలో నివసిస్తున్న షీలా కౌర్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితురాలు. షీలా కౌర్ ఇల్లు ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు అద్దం పడుతోంది.
ఇరుకైన వీధుల్లో చిన్న ఇంట్లో నివసించే షీలా కౌర్‌కు 60 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 5న జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెకు ఈ ఉద్యోగం ఇచ్చారు.
1984 సిక్కు అల్లర్లకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌కు వ్యతిరేకంగా షీలా కౌర్ ప్రధాన సాక్షి. 1984 అల్లర్లలో తన కళ్లముందే భర్తను, మామను, బావమరిదిని హత్య చేశారని షీలా చెప్పారు.
సర్కారీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రభుత్వానికి మరో విజ్ఞప్తి చేస్తున్నారు. అదేంటో ఈ వీడియో స్టోరీలో చూడండి.


(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









