మూడు రోజుల కాల్పుల విరమణతో పుతిన్ ఏం సాధించాలనుకుంటున్నారు?

    • రచయిత, స్టీవ్ రోజెన్‌బర్గ్
    • హోదా, రష్యా ఎడిటర్

కాల్పుల విరమణ ప్రకటనల్లో శాంతి కోసం చేసే నిజమైన ప్రయత్నమేది? పీఆర్ కోసం చేసే ప్రకటన ఏది?

ఆలస్యంగానైనా బాగా ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇది.

ప్రధానంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించి వినిపిస్తున్న ప్రశ్న ఇది.

రష్యా ఇటీవల స్వల్పకాలిక కాల్పుల విరమణలే ప్రకటిస్తోంది.

పుతిన్ మొదట ఈస్టర్ సందర్భంగా 30 గంటల కాల్పుల విరమణ ప్రకటించారు. మానవతా కోణంలో తీసుకున్న చర్యగా దాన్ని ప్రపంచానికి చాటుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల సమయంలోనూ ఈ కాల్పుల విరమణ కూడా అమలు కాబోతోంది.

2 గంటల పాటు అన్ని రకాల సైనిక చర్యలు నిలిపివేస్తాం అని రష్యా ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే, రష్యా ప్రతిపాదనకు స్పందించిన యుక్రెయిన్... కనీసం 30 రోజుల పాటు అమలులో ఉండేలాంటి ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా ఎందుకు అంగీకరించదు? అని ప్రశ్నించింది.

'రష్యా నిజంగానే శాంతిని కోరుకుంటే తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి. మే 8 వరకు ఎందుకు ఆగాలి?'' అని యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రశ్నించారు.

మరి.. సుమారు మూడేళ్ల కిందట యుక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా ప్రకటించిన ఈ కాల్పుల విరమణను యుద్ధాన్ని ముగించడానికి చేస్తున్న ప్రయత్నంగానే భావించాలా?

లేదంటే డోనల్డ్ ట్రంప్‌ను మెప్పించేందుకు చేస్తున్న పబ్లిక్ రిలేషన్స్ ప్రయత్నం అనుకోవాలా?

రష్యాను విమర్శించేవారు మాత్రం దీన్ని పీఆర్ ప్రయత్నం అంటూ విమర్శిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)