చిత్తూరు: 'మళ్లీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నా'

వీడియో క్యాప్షన్, 'మళ్లీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నా'
చిత్తూరు: 'మళ్లీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నా'

''పెళ్లి చేసెయ్యి. ఇంతమందిని ఇంట్లో పెట్టుకుంటే ఎలా అని చాలా మంది అన్నారు. ఈ రోజు మా పిల్లలు నలుగురికీ ప్రభుత్వ ఉద్యోగం ఉంది. మాకిప్పుడు ఎలాంటి లోటూ లేదు"..

భర్త మరణించినా, కూలీ పనులకు వెళ్లి కష్టపడి నలుగురు కూతుళ్లనూ చదివించి.. ప్రభుత్వ ఉద్యోగులను చేసిన తల్లి గౌరమ్మ గర్వంగా చెప్పిన మాటలివి.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని వేపమాకులపల్లెకు చెందిన గౌరమ్మ, మునివెంకటప్ప దంపతులకు నలుగురు కుమార్తెలు.. వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష.

తండ్రి చిన్నప్పుడే చనిపోయినా, తల్లి కష్టం వృథా కాకుండా పోటీపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు నలుగురూ.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ నలుగురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తెలుసుకోడానికి 'బీబీసీ' గౌరమ్మ ఇంటికి వెళ్లింది.

చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, మహిళలు, విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)