ఫుట్‌బాల్ ప్రపంచకప్: అద్భుతాలు, ఆశ్చర్యాలు, మెరుపులు, మరకలు
ఆదివారం రాత్రి దోహాలోని లుసైల్ స్టేడియంలో లైట్లన్నీ అతడి వైపే తిరిగాయి.
ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన వరల్డ్ కప్ మెస్సీ చేతికందింది. 35 ఏళ్ల అర్జెటీనా మాస్ట్రో 'బిష్ట్' అని పిలిచే సంప్రదాయ అరబ్ వస్త్రాన్ని ధరించి వరల్డ్ కప్ అందుకునేందుకు సిద్ధంగా నిల్చున్నాడు.
రెండు చేతులూ రుద్దుకున్నాడు. ఉద్వేగం అతడిలో స్పష్టంగా కనిపిస్తోంది. జయజయధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
టపాసులు పేలాయి. లైట్లన్నీ మెస్సీ వైపు తిరిగాయి. మెస్సీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆకాశానికెత్తి పట్టుకున్నాడు.
మెస్సీ తన కలను సాకారం చేసుకున్నాడు. తన అపూర్వమైన ఫుట్‌బాల్ కెరీర్‌లో మిగిలిన ఆ ఒక్క వెలితి తీరిపోయింది.
నిన్న జరిగిన ఫైనల్స్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యద్భుతమైన మ్యాచ్ అని చెబుతున్నారు.
ఖతార్‌లో జరిగిన ఈ ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెరుపులు, మరకలు ఈ వీడియోలో చూడండి..

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









