కర్నాటకలో ముస్లిం డ్రైవర్‌ను కొట్టి చంపిన ఘటనపై వేడెక్కిన ఎన్నికల రాజకీయాలు

వీడియో క్యాప్షన్, హత్యారోపణ ఎదుర్కొంటున్న గోరక్షకుడు పునీత్ కెరెహళ్లిపై కొనసాగుతున్న విచారణ
కర్నాటకలో ముస్లిం డ్రైవర్‌ను కొట్టి చంపిన ఘటనపై వేడెక్కిన ఎన్నికల రాజకీయాలు

కర్నాటకలో ఇద్రీస్ పాషా అనే ముస్లిం డ్రైవర్‌ని కొట్టి చంపిన దారుణ ఘటనతో, ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. గోరక్షణ సంస్థకు చెందిన పునీత్ కేరెహాళ్లి, మరికొందరు కలిసి డ్రైవర్‌ను హత్య చేసినట్టు మృతుని కుటుంబం ఆరోపించింది.

పోలీసులు ఐదుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత, పునీత్ బీజేపీ నేతలతో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

అయితే ఇద్రీస్ పాషాను తాను చంపలేదని పునీత్ అన్నాడు. ముస్లిం ఓట్ల కోసం జేడీఎస్, కాంగ్రెస్‌ మనుషులే ఈ హత్య చేశారని పునీత్ ఆరోపిస్తున్నాడు. మరి వాస్తవాలేంటి?

బీబీసీ ప్రతినిధి గుర్‌ప్రీత్ సింగ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

కర్నాటక

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)