అచ్యుతాపురం: ‘నేను నిద్రలేచేటప్పటికే అన్నయ్య ఆఫీసుకు వెళ్లిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు’

వీడియో క్యాప్షన్, అచ్యుతాపురం సెజ్ ప్రమాదం: మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం
అచ్యుతాపురం: ‘నేను నిద్రలేచేటప్పటికే అన్నయ్య ఆఫీసుకు వెళ్లిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు’

అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌'లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబీకులు విలపిస్తున్నారు.

‘‘ఎంతో దూరం నుంచి అన్నయ్యకు రాఖీ కట్టాలని వచ్చాను. కానీ ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయా. తరువాత రోజు నేను నిద్రలేచే సరికే అన్నయ్య ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఎంతో దూరం నుంచి వచ్చి కూడా అన్నయ్యను పొద్దున్నే చూడలేకపోయా’ అని ప్రమాదంలో మృతి చెందిన టెక్నిషియన్ వెంకటసాయి చెల్లెలు కిరణ్మయి ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)