సముద్రంలో మంచు తగ్గితే, తిమింగలాల గర్భధారణ రేటు తగ్గుతోంది ఎందుకు?
సముద్రంలో మంచు తగ్గితే, తిమింగలాల గర్భధారణ రేటు తగ్గుతోంది ఎందుకు?
వాతావరణ మార్పుల కారణంగా అంటార్కిటిక్ ప్రాంతంలో తిమింగాలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రాంతంలో సముద్రపు మంచు భారీగా కరిగిపోతోంది. దీంతో సముద్ర జీవావరణ వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడుతోందో అర్థం చేసుకోవడానికి హంప్ బ్యాక్ వేల్స్‌ను పరిశీలిస్తే చాలంటున్నారు పరిశోధకులు.
అంటార్కిటిక్ ద్వీపకల్పంలో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) సంస్థ నిర్వహించిన ఒక పరిశోధనలో బీబీసీ ప్రతినిధి విక్టోరియా గిల్ కూడా పాల్గొన్నారు.
ఈ ప్రాంతంలో తిమింగలాల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఈ పరిశోధకులకు ప్రత్యేక అనుమతి ఉంది.
ఈ పరిశోధనలో ఏం తేలిందో ఈ వీడియోలో చూడండి.
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఫొటో సోర్స్, Chris Johnson/WWF/UCSC/Research under NOAA Permit









