తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఎలా ఉందో చూశారా...
తెలంగాణలో కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ స్టేట్ సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఈ రోజే.
ఈ భారీ భవనాన్ని 28 ఎకరాల స్థలంలో రూ. 617 కోట్లతో నిర్మించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎనిమిది అంతస్తులలో నిర్మించిన ఈ భవనం విస్తీర్ణం 10.52 లక్షల చదరపు అడుగులు. ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల్లో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ భవనానికి 2019 జూన్ 27న శంకుస్థాపన చేశారు.
ఇండో పర్షియన్ అరేబియన్ నిర్మాణ శైలిలో ఈ నిర్మాణాన్ని 26 నెలల్లో పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, TelanganaCMO
“అన్ని శాఖలు ఒకే దగ్గర ఉంటాయి. పాలనకు సౌలభ్యంగా ఉంటుంద. మంత్రులు అధికారులు అందరికీ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉంది. 30 వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి” అని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, @TelanganaCMO
సచివాలయ భద్రత విషయంలోనూ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రతి రోజూ దాదాపు 650 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. సందర్శకులు ఎవరైనా వస్తే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో స్కాన్ చేసి ప్రత్యేక పాసులు ఇస్తారు.
ఈ సెక్రటేరియట్ ప్రత్యేకతలు, విశేషాలు ఏమిటో ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఫొటో సోర్స్, TelanganaCMO
ఇవి కూడా చదవండి:
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లైంగిక వేధింపుల గురించి మహిళా క్రీడాకారులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు.. ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- వేసవి: కారు ప్రయాణంలో తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందా?



