వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నివేదిక ఏం చెప్పింది?
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అన్ని వైపుల నుంచి ముందడుగు వేయాలని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక సూచించింది.
ఫ్రెడ్డీ తుపాను చాలా రోజుల పాటు ప్రభావం చూపిన ఉష్ణ మండల తుపానుగా రికార్డులకెక్కిందంటున్నారు వాతావరణ నిపుణులు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి తీవ్రమైన తుపాన్లు రానున్న రోజుల్లో మరిన్ని వస్తాయని తాజా నివేదిక చెబుతోంది.
యూరప్‌లోని ఆల్ప్స్ హిమానీ నదాలు మొత్తం పరిమాణంలో గత ఏడాది ఆరు శాతం కోల్పోయాయంటూ సమస్య తీవ్రతను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ గుర్తు చేశారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికత, శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏర్పడే గ్రీన్ హౌస్ వాయువుల్ని నియంత్రించేందుకు పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు లాంటివి తక్షణావసరమని చెప్పారు. ఇవి కూడా చదవండి:
- లక్షలాదిగా ఆక్టోపస్--ల సాగుకు ప్రణాళిక.. బీబీసీకి లభించిన రహస్య పత్రాలు ఏం చెప్తున్నాయి-
- వానరాలకు ఉన్నట్లుగా మన దేహమంతటా దట్టమైన జుత్తు ఎందుకు లేదు- ఈ మానవ పరిణామానికి, సెక్స్-కు సంబంధం ఏమిటి-
- అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్ - BBC News తెలుగు
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది- - BBC News తెలుగు
- ఆంధ్రప్రదేశ్- విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్-తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి- - BBC News తెలుగు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)