రష్యా, యుక్రెయిన్ యుద్ధం: ‘ఒక్క అడుగు భూమిని కూడా వదులుకునేది లేదు’ - బీబీసీ ఇంటర్వ్యూలో జెలియెన్‌స్కీ
యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసి వచ్చే వారంతో ఏడాది గడుస్తుంది.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ బీబీసీ వరల్డ్ అఫైర్స్ ఎడిటర్ జాన్ సింప్సన్‌తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇక ముందు ఏం జరగబోతుందో వివరించారు.
ఎదురు దాడి చేసే శక్తి ఉన్నంతవరకూ యుక్రెయిన్ బలగాలు దేశం కోసం పోరాడుతూనే ఉంటాయన్నారు. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు భవిష్యత్తులో ఏదైనా శాంతి ఒప్పందం కుదిరినా, అందులో భాగంగా తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జెలియన్‌స్కీ.
అలా చేస్తే యుక్రెయిన్ బలహీన దేశంగా కనిపిస్తుందన్నారు. అది పుతిన్ మరోసారి దాడి చేసేందుకు అవకాశం ఇస్తుందన్నారు. కీయెవ్ నుంచి బీబీసీ ప్రతినిధి జాన్ సింప్సన్ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఇది తగ్గాలంటే ఏం చేయాలి?
- మహా శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి
- భార్యను చంపి పదేళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు, కానీ ఆ ఒక్క సెంటిమెంట్ పట్టించింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)