You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్విటర్‌లో త్వరలో ఎడిట్ బటన్... పబ్లిక్ డిమాండ్‌కు ఓకే చెప్పిన కంపెనీ
ట్విటర్‌లో ఎట్టకేలకు ఎడిట్ బటన్ రాబోతోంది. ఎంతో కాలంగా ఎడిట్ బటన్ కావాలని యూజర్స్ అడుగుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు వాళ్ల కోరిక నెరవేరబోతోంది.
"ఏదైనా ట్వీట్ ఎడిట్ అయినట్టు కనిపిస్తే, కంగారు పడకండి. మేం ఎడిట్ బటన్ టెస్ట్ చేస్తున్నాం. త్వరలో అన్నీ సర్దుకుంటాయి" అంటూ ట్విటర్ సంస్థ ట్వీట్ చేసింది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ని టెస్ట్ చేస్తున్నారు. రాబోయే వారాల్లో ట్విటర్ బ్లూ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తెస్తారు. ట్విటర్ బ్లూ ఖరీదు నెలకు 4.99 డాలర్లు (సుమారు రూ. 400).
ట్వీట్ పోస్ట్ చేసిన 30 నిమిషాల లోపు దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది.
ట్విట్టర్ బ్లూ ప్రస్తుతానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో మాత్రమే ఉంది. అయితే ఎడిట్ బటన్ టెస్ట్ మాత్రం ఇప్పటికి ఒక దేశంలోనే చేస్తున్నారు.
ఎడిట్ చేసిన ట్వీట్లకు టైమ్ స్టాంప్, సవరణ చేసినట్లు ఒక గుర్తు, ఎడిట్ హిస్టరీకి ఒక లింక్ కనిపిస్తాయి.
"ఏం ఎడిట్ చేశారో అందరికీ తెలియడానికి, చర్చ సమగ్రతను కాపాడడానికి" ఈ ఏర్పాటు చేసినట్లు ట్విటర్ చెప్పింది.
"ఇకపై ట్వీటింగ్ మీకు మరింత చేరవవుతుంది. మీపై ఒత్తిడి తగ్గుతుంది. మీకు నచ్చినట్టు మీరు చర్చల్లో పాల్గొనగలగాలి. దానికి తగిన మార్పులు తీసుకువచ్చేందుకు మేం ప్రయత్నిస్తాం" అని ట్విటర్ సంస్థ చెప్పింది.
అయితే, ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాత్రం, "బహుశా ట్విటర్ ఎప్పటికీ ఎడిట్ బటన్‌ను అందించదని" చెప్పారు.
ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనాలని ప్లాన్ చేసినప్పుడు, ఎడిట్ బటన్‌పై ఒక పోల్ పోస్ట్ చేశారు. అప్పుడు మొత్తం 44 లక్షల యూజర్లలో 73.6 శాతం ఎడిట్ బటన్ కావాలని ఓటు వేశారు.
అయితే, కొందరు ఈ బటన్ అనవసరమని, ట్విట్టర్ వేదిక స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
మరికొందరు ఎడిట్ బటన్‌ను మరింత మెరుగుపరచడానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- మురుగా మఠం అధిపతి స్వామి శివమూర్తిపై లైంగిక వేధింపుల కేసు... అసలేం జరిగింది?
- విక్రాంత్: ఈ విమాన వాహక యుద్ధ నౌకను తయారు చేసేందుకు ఎంత ఖర్చయింది, దీని ప్రత్యేకతలేంటి?
- కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?
- 'మూత్రాన్ని నోటితో శుభ్రం చేయించేవారు' ... పనిమనిషిని వేధించిన బీజేపీ నేత సీమా పాత్రా ఉదంతం ఎలా వెలుగులోకి వచ్చింది?
- ప్రిజన్ క్యాంప్-120: ఈ జైలులో అసలేం జరిగింది... 50 మంది ఖైదీలు ఎలా కాలి బూడిదయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)