తేలు విషం లీటర్ రూ. 80 కోట్లు.. అంత డిమాండ్ ఎందుకంటే
ఒక చిన్న చుక్క తేలు విషం కూడా ఎంతో ఖరీదైంది. ఒక లీటర్ తేలు విషం ధర 10 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ. 80 కోట్లు.
టర్కీలోని ఓ ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తుంది. బాక్సుల్లోంచి తేళ్లను బయటకు తీసి వాటి నుంచి ప్రత్యేక పద్ధతుల్లో విషం సేకరిస్తారు.
ఆ తర్వాత విషాన్ని గడ్డకట్టించి, అనంతరం పొడి చేసి విక్రయిస్తారు.
మెటిన్ ఒరిన్లెర్ అనే తేళ్ల ఫామ్ యజమాని బీబీసీతో మాట్లాడుతూ... విషం ఎలా సేకరిస్తారు వంటి వివరాలన్నీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మేం తేళ్లను పెంచుతాం. అలాగే వాటి నుంచి విషాన్ని సేకరిస్తాం. మేము విషాన్ని సేకరించి, దాన్ని గడ్డకట్టేలా చేస్తాం. ఘనీభవించిన విషాన్ని ఆ తర్వాత పొడిగా మార్చి, విక్రయిస్తాం’ అని చెప్పారు.
తేలు విషాన్ని యాంటీబయోటిక్స్.. కాస్మోటిక్స్.. పెయిన్‌కిల్లర్ల తయారీలో ఉపయోగిస్తారు.
‘ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. సాధారణంగా 300 - 400 తేళ్ల నుంచి మేం ఒక గ్రాము విషం సేకరిస్తాం’ అని మెటిన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- రిషి సునాక్: భారత సంతతి వ్యక్తిని ప్రధానిగా అంగీకరించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉందా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్: పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

