సెల్ఫ్ డ్రైవింగ్ షిప్స్: మనుషులు లేకుండా తమంతట తామే ప్రయాణించే ఎలక్ట్రిక్ నౌకలు

వీడియో క్యాప్షన్, పూర్తిగా స్వయం చాలితంగా నడిచే సరకు రవాణా నౌక మొదటి అడుగులకు సిద్ధమైంది

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ట్రెయిన్ల గురించి మనం విన్నాం.

అయితే సముద్రంలోనూ మనుషులు లేకుండానే నౌకలు ప్రయాణించబోతున్నాయా?

మనం ఇప్పుడు నార్వే వెళదాం. అంతా ఎలక్ట్రిక్.. పూర్తిగా స్వయం చాలితంగా నడిచే సరకు రవాణా నౌక మొదటి అడుగులకు సిద్ధమైంది.

బీబీసీ ప్రతినిధి అడ్రీన్ ముర్రే అందిస్తున్న రిపోర్ట్.

నార్వేలోని నదీ మార్గం గుండా నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నఈ నూతన నౌకతో పాటే అలలు కూడా కదులుతున్నాయి.

ఇది ఉద్గారాలు లేని ప్రయాణంలో భాగం కావాలని సమీపంలోని ఓడరేవుకు వెళుతోంది.

యారా బైకర్‌ల్యాండ్ అని పిలిచే ఈ నౌకలో ఓ ఎరువుల ఫ్యాక్టరీ దగ్గర వంద కంటైనర్‌లను లోడ్ చేశారు.

ఇందులో దాదాపు ఏడు మెగావాట్ మెగావాట్ అవర్స్ సామర్థ్యం ఉంది. అది 90 టెస్లా కార్లను నడిపించడానికి సరిపోతుంది.. అంతా అనుకున్నట్టు జరిగితే, వచ్చే రెండేళ్ళలో ఈ నౌకపైన ఎలాంటి సిబ్బంది అవసరం ఉండదు.

ప్రయాణంలో సేకరించిన సమాచారం అల్గారిథంకు శిక్షణ ఇస్తుంది. తర్వాత రాడార్ సెన్సర్లు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు నౌక సొంతంగా ప్రయాణించేలా సహయపడతాయి

ఎరువులు, నౌకాయాన రంగాలు భారీస్థాయిలో కాలుష్య కారకంగా మారాయి.

అయితే ప్రతి ఏటా రోడ్డుపై తిరగాల్సిన దాదాపు 40వేల ట్రక్కులను తిరగాల్సిన అవసరం లేకుండా చేయడం వల్ల, వేల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నివారించగలిగారు.

ఇప్పటికే మనుషులు లేని చిన్న చిన్న బోట్లు ఆటోనమస్ సబ్ సీ డ్రోన్ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి.

కాన్స్‌బర్గ్ అనే నార్వేజియన్ కంపెనీ ఈ సాంకేతికతలో వేగంగా ముందడుగు వేస్తోంది.

అయితే దానికి కొత్త నిబంధనలు అవసరం.

ఈ టెక్నాలజీ సాయంతో మహాసముద్రాలను దాటే నౌకలను నడపడం ఎంతో దూరంలో లేదు.

ఇప్పటి దాకా స్వయం చాలిత నౌకలు ఎవరికీ చెందని, ఎవరూ అన్వేషించని సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి.

త్వరలోనే సిబ్బందిలేని నౌకలు నార్వే సముద్ర తీరంలో తిరగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)