ఇజ్రాయెల్ - పాలస్తీనా మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ఈ శాంతి కొనసాగేనా?

వీడియో క్యాప్షన్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య మూడు రోజుల ఘర్షణకు బ్రేక్

ఇజ్రాయెల్ – పాలస్తీనా మిలిటెంట్ల మధ్య మూడు రోజుల పాటు కొనసాగిన ఘర్షణకు ముగింపు పలకటానికి చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుపక్షాలూ చాలావరకూ పాటిస్తున్నట్లుగానే కనిపిస్తోంది.

ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌ నాయకుడు ఒకరిని ఇజ్రాయెల్ హత్య చేయటంతో తాజా హింస చెలరేగింది.

తమ నేత హత్యకు తీవ్రంగా ప్రతిస్పందించిన ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఇజ్రాయెల్ మీదకు పదుల సంఖ్యలో రాకెట్లు, మోర్టార్లను పేల్చింది.

గాజా మీద శుక్రవారం నుంచి జరిగిన ఇజ్రాయెలీ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారని పాలస్తీనా అధికారులు చెప్తున్నారు.

బీబీసీ మిడిల్ ఈస్ట్ కరెస్పాండెంట్ యొలాండే నెల్ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)