దక్షిణాఫ్రికా నగరం కెబాహాలో తీవ్ర నీటి సంక్షోభం.... ముంచుకొస్తున్న ‘డే జీరో’

వీడియో క్యాప్షన్, దక్షిణాఫ్రికా నగరం కెబాహాలో తీవ్ర నీటి సంక్షోభం... ముంచుకొస్తున్న ‘డే జీరో’

దక్షిణాఫ్రికాలోని నెల్సన్ మండేలా బే లో.. ముంచుకొస్తున్న నీటి సంక్షోభాన్ని నివారించటానికి ప్రభుత్వ యంత్రాంగం కాలంతో పోటీ పడుతోంది. నీటి కుళాయిలు ఎండిపోకుండా ఆపటానికి తంటాలు పడుతున్నారు.

కెబేహా నగరంలో ప్రజలు ముంచుకొస్తున్న ‘డే జీరో’ కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రజలు నీటిని చాలా పొదుపుగా ఉపయోగించాలని అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న నీటి నిల్వలు మరో పది రోజులు కూడా వచ్చేలా లేవు. దీంతో 100కు పైగా టౌన్‌షిప్‌లలో కుళాయిలు వేగంగా ఎండిపోతున్నాయి.

సుదీర్ఘంగా కొనసాగుతున్న కరవు పరిస్థితులు, నీటి వసతుల నిర్వహణలో వైఫల్యాలు ఈ సంక్షోభానికి కారణమయ్యాయి.

బీబీసీ ప్రతినిధి నోమ్సా మసేకో ఈ ప్రాంతాన్ని సందర్శించి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)