క్రిప్టో విలువ భారీ పతనంతో అయోమయంలో ఎల్ సాల్వడార్

వీడియో క్యాప్షన్, నెలల క్రితం బిట్ కాయిన్‌ను చట్టబద్ధం చేసిన ఎల్ సాల్వడార్

క్రిప్టో కరెన్సీ మార్కెట్ రెండు వారాలుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దీంతో బిట్ కాయిన్ విలువ దారుణంగా పడిపోయింది. ఈ పతనంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారులతో పాటు ఎల్ సాల్వడార్ కూడా నష్టపోయింది. బిట్ కాయిన్‌ల కోసం వేల కోట్ల డాలర్లు కుమ్మరించిన ఎల్ సాల్వడార్ తొమ్మిది నెలల క్రితం దాన్ని చట్టబద్ధం చేసింది. ప్రజలు రోజువారీ లావాదేవీల్లో బిట్ కాయిన్లు ఉపయోగించేలా ప్రోత్సహించింది. కానీ క్రిప్టో కరెన్సీ తాజా పతనంతో ప్రభుత్వం ఆశించినంతగా లావాదేవీలు జరగడం లేదు. ఎల్ సాల్వడార్ నుంచి బీబీసీ ప్రతినిధి జో టైడీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)