యుక్రెయిన్ పౌరులనూ రష్యా బందీలుగా పట్టుకుంటోందా

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌ యుద్ధంలో సైనికులతో పాటు పౌరుల్ని కూడా రష్యన్లు బందీలుగా తీసుకెళుతున్నారు.

యుద్ధంలో శత్రు సైన్యానికి చిక్కడమనేది ఏ సైనికుడికైనా పీడకల లాంటిదే. అయితే ఈ యుద్ధంలో రష్యన్లు ప్రజలను కూడా బందీలుగా పట్టుకున్నారు.

బందీలుగా పట్టుకున్న వారిని రష్యా సైనికులు రెండు రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు తీసుకుని వాళ్లను తిరిగి అప్పగించడం, యుద్ధ ఖైదీల మార్పిడి కోసం ఉపయోగించుకోవడం చేస్తున్నారు. కొన్ని కేసుల్లో ఇది జరిగింది. అలాగే యుక్రెయిన్ ప్రజల్లో తిరుగుబాటుని అణచివేయడం కూడా రష్యన్లు చేస్తున్నారు.

యుద్ధ ఖైదీగా ఉంటూ రష్యన్ల నుంచి బయటపడిన ఓ యుక్రేనియన్ సైనికుడు కీయెవ్‌లో బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌస్‌తో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)