ఇది ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు.. దీని కోసం యుద్ధాలూ జరగొచ్చు..

వీడియో క్యాప్షన్, ఇది ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు

చమురు, గ్యాస్‌ల ఇప్పటి వరకు ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ, రాబోయే కాలంలో కొన్ని లోహాల కోసం యుద్ధాలు జరగొచ్చు.

మార్చి 8, ఉదయం 5:42 గంటలకు నికెల్ ధర చాలా వేగంగా పెరగడం మొదలు పెట్టినప్పుడు లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో ఆందోళన నెలకొంది. 18 నిమిషాల వ్యవధిలో నికెల్ ధర టన్ను లక్ష డాలర్ల (సుమారు రూ.75లక్షల)కు చేరుకుంది. దీంతో మెటల్ ఆపరేషన్‌‌ను నిలిపేయాల్సి వచ్చింది.

ఈ రికార్డులు బద్దలు కావడానికి ముందు 24 గంటల్లో నికెల్ ధర 250శాతం పెరిగింది. యుక్రెయిన్‌‌పై రష్యా దాడి చేసిన తర్వాత మార్కెట్‌లో భారీ లోహ సంక్షోభం తలెత్తడం ఇదే తొలిసారి.

రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలే ఈ ధరల పెరుగుదలకు కారణమని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. నికెల్ వంటి లోహానికి ప్రపంచంలో ఎంత ప్రాముఖ్యత ఉందో దీన్నిబట్టి స్పష్టమైంది. తక్కువ కాలుష్యం గల ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడానికి ఈ లోహం చాలా ముఖ్యం.

ప్రపంచ గ్యాస్, పెట్రోల్‌ సరఫరాలో రష్యాది ప్రధాన పాత్ర. అయితే, రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో చమురు, గ్యాస్‌లను ఆయుధాలుగా ప్రయోగించవచ్చని పశ్చిమ దేశాలు నిరూపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)