You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డాట్సన్ కార్లు 'గుడ్ బై' చెబుతున్నాయి... ఎంతో చరిత్ర ఉన్న ఈ బ్రాండ్ ఎందుకు కనుమరుగవుతోంది?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన డాట్సన్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయనుంది. ఆటోమొబైల్ రంగంలో ఎంతో పేరు పొందిన డాట్సన్ వాహనాలకు దాదాపు వందేళ్ళ చరిత్ర ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌లోని కార్ల ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడింది డాట్సన్ బ్రాండ్.
అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కార్లను అమ్మినప్పటికీ, 1980లలో డాట్సన్ పేరు నెమ్మదిగా మార్కెట్ నుంచి కనుమరుగవడం మొదలైంది.
మూడు దశాబ్ధాల తర్వాత సంస్థ కొత్త శ్రేణి వాహనాలను విడుదల చేసింది. ఇవి నిస్సాన్ డీఎన్‌ఏలో ముఖ్య భాగమని పేర్కొంటూ బ్రాండును పునరుద్ధరించింది.
డాట్సన్ కార్ల స్టాక్ అమ్మకాలను కొనసాగించి వినియోగదారులకు కొనుగోలు అనంతర సేవలను కూడా అందిస్తామని నిస్సాన్ ప్రతినిధి అజూసా మోమోస్ సోమవారం బీబీసీకి చెప్పారు.
"వినియోగదారులకు సంతృప్తి ఇవ్వడానికే మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. డాట్సన్ బ్రాండ్ ఉపయోగిస్తున్నవారికి మేమిచ్చే భరోసా భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది" అని ఆమె అన్నారు.
డాట్సన్ బ్రాండ్ ప్రాచుర్యం పొందక ముందు 1914లో టోక్యోలో కైషిన్షా మోటార్ కార్ వర్క్స్ డాట్ అనే పేరుతో కారును నిర్మించింది.
వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డెన్, ఆయోమా, ట్రస్ట్ వర్థీ అనే తొలి ముగ్గురు పెట్టుబడిదారుల పేర్లలోని మొదటి అక్షరాలతో దీనికి డాట్ అనే పేరును పెట్టారు.
1933లో నిస్సాన్ వ్యవస్థాపకుడు యోషీ సుకే ఐకావా వ్యాపారానికి అధిపతి అయ్యారు.
1930ల మొదట్లో చౌకగా, తేలికగా ఉండే డాట్- సన్ అనే పేరుతో ఒక కారును లాంచ్ చేశారు. ఈ పేరును తర్వాత డాట్సన్‌గా మార్చారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ కార్ల ఉత్పత్తిదారులు యూరప్, అమెరికా, ఆసియాలలో నిలదొక్కుకునేందుకు డాట్సన్ తోడ్పడింది.
నిస్సాన్ ప్రధాన బ్రాండుతో పాటు లగ్జరీ ఇన్ఫినిటీతో పాటు డాట్సన్ కూడా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసింది.
1970లలో గ్యాస్ పై ఆధారపడకుండా ప్రతి రోజు కార్లను వాడే వారికి ఈ బ్రాండు మంచి ప్రత్యామ్నాయం అని మార్కెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో సుమారు 2 కోట్ల డాట్సన్ కార్లు అమ్ముడయ్యాయి.
కానీ, ఈ పేరు నెమ్మదిగా 1981 నుంచి మార్కెట్లో కనుమరుగవ్వడం మొదలయింది.
డాట్సన్ బ్రాండును పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంస్థ 2012లో ప్రకటించింది. ఇదే పేరుతో భారత్, ఇండోనేసియాలలో కార్లను అమ్మింది.
అయితే, యూరప్, అమెరికాలో నిస్సాన్ మార్కెట్‌లో బలం పుంజుకోలేకపోయింది.
దీంతో, తక్కువ ధరతో కూడిన మోడళ్లతో అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల పై దృష్టి పెట్టింది. ఈ చర్యలన్నీ చేపట్టినప్పటికీ, ఈ మోడల్ కార్ల అమ్మకాలు మాత్రం ఇటీవల కాలంలో తీవ్రంగా పడిపోయాయి.
సంస్థ అంతర్జాతీయ వ్యాపార వ్యూహంలో భాగంగా వినియోగదారులకు, డీలర్లకు, సంస్థకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా కొన్ని ప్రత్యేకమైన కార్ల మోడళ్ళు, విభాగాల పై దృష్టి పెడతామని నిస్సాన్ సోమవారం చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- చైనా చివరి చక్రవర్తి తోటమాలిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది?
- ఒకే వ్యక్తికి మూడు వయసులు - కొరియాలో పుడితే అంతే
- హైదరాబాద్: ‘గుడికి వచ్చిన భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’
- ఈ నిధి ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు
- శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)