You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్ట్రేలియా: షేన్ వార్న్ మృతి
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందారు.
52 ఏళ్ల షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసినట్లు ఆయన మేనేజ్‌మెంట్ కంపెనీ వెల్లడించింది.
క్రికెట్ దిగ్గజాల్లో ఆయన కూడా ఒకరు.
థాయ్‌లాండ్‌లోని కో సమౌ దీవిలో ఉన్న తన విల్లాలో షేన్ వార్న్ శుక్రవారం అపస్మారక స్థితిలో కనిపించారని ఆయన మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రకటించింది.
‘‘అనుమానాస్పద గుండెపోటుతో షేన్ కీత్ వార్న్ కన్నుమూశారని చెప్పడానికి చింతిస్తున్నాం’’ అని కంపెనీ వెల్లడించింది.
ఆయనకు వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన్ను బతికించుకోలేకపోయామని పేర్కొంది.
‘‘ఇప్పుడు ఏకాంతం కావాలని ఆయన కుటుంబం కోరుకుంటోంది. మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తాం’’ అని తెలిపింది.
15 ఏళ్లపాటు టెస్ట్ క్రికెట్ ఆడిన షేన్ వార్న్ 145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు తీశారు.
1993 నుంచి 2005 వరకూ 194 వన్ డే ఇంటర్నేషనల్స్ (ఓడీఐ)ల్లో 293 వికెట్లు తీశారు.
1999లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో వార్న్ సభ్యుడు.
2007లో ఆటగాడిగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్న్ 2013 వరకూ ట్వంటీ20 క్రికెట్ ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా కొంతకాలం పాటు ఆడిన వార్న్ 2020లో ఆ జట్టు మెంటార్‌గా నియమితులయ్యారు.
అప్పట్నుంచి ఇప్పటి వరకూ క్రికెట్ కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా ఆయన తన అభిమానులను అలరిస్తున్నారు.
షేన్ వార్న్ మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామంటూ పలువురు క్రికెట్ సెలబ్రిటీలు ట్వీట్ చేసి, తమ సంతాపం ప్రకటిస్తున్నారు.
నమ్మలేకపోతున్నా - వీరేంద్ర సెహ్వాగ్
మాటల్లో చెప్పలేనంత షాక్ - షోయబ్ అఖ్తర్
ఇది నిజం కాదని చెప్పండి ప్లీజ్ - దినేశ్ కార్తీక్
లెజెండరీ, ఫ్రెండ్ - కుమార సంగక్కర
ఇవి కూడా చదవండి:
- ‘రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు’ - అమరావతి పిటిషన్లపై తుది తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- యుక్రెయిన్: ఖార్కియెవ్ బంకర్లో భారతీయ విద్యార్థులు... ఒకవైపు బాంబుల భయం, మరో వైపు ఆకలి బాధ
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)