చెట్టెక్కుతున్న పులులు.. వేట కోసం కాదు, పార్టీ కోసం..

వీడియో క్యాప్షన్, పార్టీ గిఫ్ట్ కోసం చెట్టెక్కుతున్న పులులు..

నేరుగా చెట్టుపైకి ఎగబాకుతున్న ఈ పులిని చూడండి. అది చెట్టెక్కుతోంది వేట కోసం అనుకుంటే పొరపాటే.

అది ఒక బహుమతి కోసం ఇంత శ్రమపడుతోంది.

ముందు చెట్టు పైకి ఎక్కి ఆ పెట్టెను చేరుకోవడానికి ప్రయత్నించింది.

అలా లాభం లేదని, చెట్టు దిగి వచ్చి మరోవైపు నుంచి దాని తాడు లాగింది.

తాడు లాగగానే పెట్టె కింద భాగం తెరుచుకుంది. బహుమతి బయటపడింది.

అలా పైనుంచి పడగానే ముందు పులి కంగారుపడింది.

కానీ, మళ్లీ వెనక్కి తిరిగొచ్చింది.

బహుమతిగా వచ్చిన ఆహారాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది

ఈ దృశ్యం సింగపూర్ జంతు ప్రదర్శనశాల లోనిది.

లూనార్ నూతన సంవత్సరానికి ముందు పులులకు ఈ విధంగా విందు ఏర్పాటుచేశారు.

ఈ రెండో పులిని చూడండి... ఎలాగైనా బహుమతిని అందుకోవాలని ఎంత తాపత్రయపడుతోందో!

ఇలాంటి పార్టీ కోసం పులులు సంవత్సరమంతా వేచి చూస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)