సహారా: ఎడారిలో హిమపాతం
వాయువ్య అల్జీరియాలో ఉన్న సహారా ఎడారిలో మంచు కురిసింది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
ఎడారి నుంచి వచ్చే వేడి నుంచి చుట్టు పక్కల పట్టణాల్లోని పిల్లలకు ఈ మంచు కాస్త ఊరట కలిగించింది.
ఎడారి ఇసుకలో మంచు రేణువులు ఆశ్చర్యకరమైన ఆకృతులలో కనిపించి కనువిందు చేశాయి.
జారేందుకు అనువుగా ఉండే ఇసుక దిబ్బలు కూడా పాక్షికంగా మంచు, ఐస్‌తో నిండిపోయాయి.
సహారా ఎడారికి ముఖ ద్వారంగా చెప్పే అయిన్ సెఫ్రా అనే పట్టణంలో మంచు కురిసింది.
అట్లాస్ పర్వతాల మధ్యలో ఉన్న పట్టణంలో ఉష్ణోగ్రతలు గత రెండు, మూడు రోజుల నుంచి రాత్రిపూట మైనస్ 2 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి.
ఈ ఏడాది మంచు కురవడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. 2021, 2018, 2017లో కూడా ఇక్కడ మంచు కురిసింది.
కానీ, 2016లో ఎర్రని ఇసుక దిబ్బలపై కురిసిన మంచు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 1979 తర్వాత ఇక్కడ మంచు కురవడాన్ని మొదటిసారి చూసినట్లు అయిన్ సెఫ్రా నివాసులు చెబుతున్నారు. ఇలా మంచు కురవడం ప్రస్తుతం సాధారణంగా మారుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భర్తతో సెక్స్‌కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్‌పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?
- వృద్ధుడి మృతదేహంతో పోస్టాఫీసుకు వచ్చారు.. పెన్షన్ ఇవ్వమని అడిగారు.. ఆ తర్వాత..
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి... ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)


