టోంగా: పేలిన భారీ అగ్నిపర్వతం, పోటెత్తిన సునామీ
దక్షిణ పసిఫిక్ సముద్రంలోని దీవుల దేశం టోంగా సమీపంలో సముద్రగర్భంలో ఓ భారీ అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీంతో ఆకాశంలోకి భారీ ఎత్తున బూడిత మేఘాలు ఆవరించాయి. సముద్రంలో సునామీ పోటెత్తింది.
పసిఫిక్ దీవులను బూడిద కమ్మేసింది. విద్యుత్ సరఫరా, టెలిఫోన్ కమ్యూనికేషన్లు తెగిపోయాయి. అమెరికా, న్యూజిలాండ్, జపాన్ సహా పలు దక్షిణ పసిఫిక్ సముద్ర తీర దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా రాష్ట్రాల్లో కొన్ని తీర ప్రాంతాలను సునామీ అలలు తాకాయి.
హంగా-టోంగా హంగా-హాఆపాయ్ అగ్నిపర్వతం పేలుడు శబ్దం టోంగా నుంచి సుదూరంలో ఉన్న అమెరికాతో పాటు.. 2,383 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ వరకూ వినిపించింది.
టోంగా రాజధాని నుకుఅలోఫాలోకి కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే ఈ అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. టోంగా తీరాన్ని సునామీ ముంచెత్తడంతో మీటరుపైగా ఎత్తున నీరు చేరింది.
టోంగా జనాభా లక్షా ఐదు వేల మంది కాగా.. దాదాపు 80,000 మంది ఈ ఉత్పాతానికి ప్రభావితులై ఉంటారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్‌సీ) బీబీసీతో చెప్పింది. ఇప్పటివరకూ ఎలాంటి మరణాలూ సంభవించినట్లు వార్తలు రాలేదు.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ కరోనా సోకవచ్చా? ఒమిక్రాన్ గురించి ఏడు ప్రశ్నలు, జవాబులు
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్‌కు కొత్త తలనొప్పులు - సమాజ్‌వాది పార్టీలో టికెట్ల చిక్కులు
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



