ఎలాన్ మస్క్: టెస్లాకు ఎందుకంత క్రేజ్? దీని విజయ రహస్యం ఏమిటి?
టెస్లా... ఇప్పుడు ఈ పేరునే జపిస్తున్నాయి దేశంలోని చాలా రాష్ట్రాలు. మా వద్దకు రండి అంటే మా వద్దకు రండి అంటూ పోటీ పడి మరి ఆహ్వానిస్తూ ఉన్నాయి.
ఇంతగా దేశంలోని రాష్ట్రాలు వెంటబడుతున్న టెస్లా చరిత్ర ఏంటి? ఎందుకు దానికి అంత క్రేజ్? టెస్లా మీద ఉన్న విమర్శలు ఏంటి?
టెస్లా చరిత్ర ఏంటి?
ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లాను ఒక సంచలనంగా చెబుతుంటారు. 2003లో ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూస్తు నేడు ఒక ట్రిలియన్ డాలర్స్ కంపెనీగా అవతరించింది. అదే రూపాయల్లో చెప్పాలంటే టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ 74 లక్షల కోట్లు. అంటే ప్రపంచంలో చాలా దేశాల జీడీపీ కంటే ఈ కంపెనీ మార్కెట్ విలువే ఎక్కువ.
నేడు చాలా మంది టెస్లాను స్థాపించింది ఎలాన్ మస్క్ అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి టెస్లాను స్థాపించింది మార్టిన్ ఇబర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు అమెరికన్ ఇంజినీర్లు.
2004లో పెట్టుబడులు పెట్టడం ద్వారా టెస్లాలో మెజారిటీ షేర్ హోల్డర్ అయ్యారు ఎలాన్ మస్క్. 2008లో ఆ కంపెనీకి సీఈఓ అయ్యారు. భవిష్యత్తులో రవాణా రంగాన్ని మరింత పర్యావరణ హితంగా తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని చెబుతోంది టెస్లా.
ఫిజిక్స్ మీద పట్టు ఉన్న వాళ్లకు టెస్లా అంటే ఏంటో తెలిసే ఉంటుంది. టెస్లా అనేది అయస్కాంత క్షేత్ర సామర్థ్యాన్ని కొలిచే ఒక యూనిట్. ప్రముఖ ఎలక్ట్రిక్ ఇంజినీర్ నికోలస్ టెస్లా పేరు మీదుగా ఆ యూనిట్‌కు టెస్లా అని పేరు పెట్టారు. నికోలస్ టెస్లా సేవలకు గుర్తుగా టెస్లా అని తమ కంపెనీకి పేరు పెట్టుకున్నారు ఫౌండర్స్.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ కరోనా సోకవచ్చా? ఒమిక్రాన్ గురించి ఏడు ప్రశ్నలు, జవాబులు
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్‌కు కొత్త తలనొప్పులు - సమాజ్‌వాది పార్టీలో టికెట్ల చిక్కులు
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



