You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మడగాస్కర్: సముద్రంలో కూలిపోయిన హెలీకాప్టర్.. 12 గంటల పాటు ఈతకొట్టి, ప్రాణాలతో బయటపడ్డ 57 ఏళ్ల మంత్రి
సముద్రంలో హెలీకాప్టర్ కూలిపోవడంతో తాను 12 గంటల పాటు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డానని మడగాస్కర్‌కు చెందిన ఒక మంత్రి వెల్లడించారు. రెస్క్యూ మిషన్ సందర్భంగా తమకు ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
''ఇది నేను చనిపోయే సమయం కాదు'' అని పోలీస్ మినిస్టర్ సెర్జె గెలె అన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
హెలీకాప్టర్‌లో ఆయనతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు.
ఈశాన్య ప్రాంతంలో ప్రయాణీకుల పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి ఈ బృందం వెళ్లింది.
పడవ మునక ప్రమాదంలో కనీసం 39 మంది మరణించారని మంగళవారం అధికారులు తెలిపారు.
ఈ ఘటన పట్ల ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలీనా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారితో పాటు గెలె, మిగతా ఇద్దరు అధికారులకు కూడా ఆయన నివాళులర్పించారు.
కానీ ఈ ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు.
హెలీకాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి 7:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు ఈదుకుంటూ వచ్చినట్లు గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు.
తనకు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే తనకు చలిగా ఉందని అన్నారు.
''నా కుటుంబ సభ్యులు, నా సహోద్యోగులు, ప్రభుత్వ అధికారులు చూసే విధంగా ఈ వీడియోను ప్రసారం చేయాలని నేను కోరుకుంటున్నా. నేను బతికే ఉన్నాను. క్షేమంగా ఉన్నాను'' అని మహాంబో గ్రామస్థులను గెలె కోరారు.
గెలె, హెలీకాప్టర్‌లోని ఒక సీటును నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ తెలిపారు.
''ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారు. మంత్రిగా కూడా ఆయన అదే లయను కొనసాగించారు. 30 ఏళ్ల వ్యక్తిలా ఆయన పోరాడారు. ఆయనవి ఉక్కు నరాలు'' అని రావోవీ ప్రశంసించారు.
మూడు దశాబ్ధాల పాటు పోలీసు శాఖలో పనిచేసిన గెలె, ఈ ఆగస్టులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇవి కూడా చదవండి:
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- ఒమిక్రాన్: 'జీవితం కోల్పోవడం కంటే... ఒక ఈవెంట్ రద్దు చేసుకోవడం మంచిది': డబ్ల్యూహెచ్ఓ చీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)