‘తిండి లేదు, వైద్యం అందదు.. రోజూ ఇదే పరిస్థితి’

వీడియో క్యాప్షన్, ‘తిండి లేదు, వైద్యం అందదు.. రోజూ ఇదే పరిస్థితి’

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు పాలన చేపట్టి నాలుగు నెలలు దాటింది. అప్పటి నుంచి దేశంలో మొదలైన ఆర్థిక వ్యవస్థ పతనం ఇంకా కొనసాగుతోంది.

ఒకవైపు కరోనా, మరోవైపు అంతర్జాతీయ సహాయం అందకపోవడం వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి.

దాదాపు పది లక్షల మంది పిల్లలకు ఆహారం అందట్లేదు. లక్షలాది మంది పిల్లలకు తక్షణం వైద్య సదుపాయం, ఆహారం అందకపోతే వాళ్లు పోషకాహారలోపానికి గురయ్యే ప్రమాదం ఉంది.

మధ్య అఫ్గానిస్తాన్‌లోని ఘోర్ ప్రావిన్సు నుంచి బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మాణీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)