అఫ్గానిస్తాన్- తజికిస్తాన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం.. ఎందుకు వచ్చిందంటే..

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్- తజికిస్తాన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం.. ఎందుకు వచ్చిందంటే..

తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడం, పరిపాలన ప్రారంభించడంతో ఎంతో మంది ప్రజలు అఫ్గానిస్తాన్‌ను వీడే ప్రయత్నం చేస్తున్నారు.

అఫ్గాన్ నుంచి చొరబాట్లను నివారించేందుకు పొరుగున ఉన్న తజికిస్తాన్ తమ సరిహద్దుల్లో భద్రత పెంచింది.

రష్యా సైన్యంతో కలసి సైనిక విన్యాసాలు కూడా నిర్వహించింది.

అఫ్గాన్ నుంచి తీవ్రవాదులు వస్తారని, వారిని అడ్డుకునేందుకే తాము సరిహద్దుల్లో భద్రత పెంచామని తజికిస్తాన్ చెబుతోంది.

అయితే, తజికిస్తాన్‌లోకి ఆశ్రయం కోసం వచ్చిన తాము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అఫ్గాన్ శరణార్థులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)