ఈ వారం ప్రపంచం: పాకిస్తాన్‌లో డ్రగ్స్ దహనం, ఆస్ట్రేలియాలో కుప్పకూలిన థర్మల్ స్టేషన్, న్యూయార్క్‌లో బేబీ యోధా... ఇంకా మరెన్నో చిత్రాలు..

ధ్రువపు ఎలుగుబంట్ల కొట్లాట, ఈజిప్టు లగ్జర్‌లో పర్యాటక ఆకర్షణ, స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన మేగ్దలీనా ఆండర్సన్‌‌పై అభినందల వర్షం... ఇంకా మరెన్నో విశేషాల ఫోటో ఫీచర్.

ఇంగ్లండ్‌ ఆగ్నేయ తీరంలో బుధవారం రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇనిస్టిట్యూషన్ సిబ్బంది రక్షించడంతో బతికిన తన చిన్నారులను తీసుకెళ్తున్న వలసదారు.

ఫొటో సోర్స్, BEN STANSALL / AFP

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌ ఆగ్నేయ తీరంలో బుధవారం రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇనిస్టిట్యూషన్ సిబ్బంది రక్షించడంతో బతికిన తన చిన్నారులను తీసుకెళ్తున్న వలసదారు. బుధవారం ఇక్కడే బోటు మునిగి 27 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.
ఫ్రెంచ్ దీవి కోర్సికాలోని యునెస్కో హెరిటేజ్ సైట్ ‘కలాంక్స్ డి పియానా’ సమీపంలో రోడ్డుపై పడిన కొండ రాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.

ఫొటో సోర్స్, PASCAL POCHARD-CASABIANCA / AFP

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ దీవి కోర్సికాలోని యునెస్కో హెరిటేజ్ సైట్ ‘కలాంక్స్ డి పియానా’ సమీపంలో రోడ్డుపై పడిన కొండ రాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.
స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత మేగ్దలీనా ఆండర్సన్‌‌కు అభినందనలు చెబుతున్న సభ్యులు. అక్కడికి కొద్ది గంటల్లోనే ఆమె సంకీర్ణంలోని పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో ఆండర్సన్ రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, ERIK SIMANDER / AFP

ఫొటో క్యాప్షన్, స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత మేగ్దలీనా ఆండర్సన్‌‌కు అభినందనలు చెబుతున్న సభ్యులు. అక్కడికి కొద్ది గంటల్లోనే ఆమె సంకీర్ణంలోని పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో ఆండర్సన్ రాజీనామా చేశారు.
ఈజిప్ట్‌లోని లగ్జర్‌లో 3000 ఏళ్ల కిందటి స్పినిక్స్ ఆవరణను ప్రజల సందర్శన కోసం తెరిచిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన. కర్నాక్, లగ్జర్ ఆలయాలను కలిపేలా 3 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ ప్రాచీన నడక మార్గాన్ని వెలుగులోకి తెచ్చేందుకు దశాబ్దాల పాటు తవ్వకాలు జరిపారు.

ఫొటో సోర్స్, KHALED DESOUKI / AFP

ఫొటో క్యాప్షన్, ఈజిప్ట్‌లోని లగ్జర్‌లో 3000 ఏళ్ల కిందటి స్పినిక్స్ ఆవరణను ప్రజల సందర్శన కోసం తెరిచిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన. కర్నాక్, లగ్జర్ ఆలయాలను కలిపేలా 3 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ ప్రాచీన నడక మార్గాన్ని వెలుగులోకి తెచ్చేందుకు దశాబ్దాల పాటు తవ్వకాలు జరిపారు.
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను తగలబెడుతున్న యాంటీ నార్కోటిక్ ఫోర్సెస్

ఫొటో సోర్స్, AAMIR QURESHI / AFP

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను తగలబెడుతున్న యాంటీ నార్కోటిక్ ఫోర్సెస్
ఆస్ట్రేలియాలో మూతపడిన వాలర్‌వాంగ్ థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ టవర్లను కూల్చివేశారు. 2014 వరకు ఈ విద్యుత్కేంద్రం పనిచేసింది. ఇక్కడ ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు.

ఫొటో సోర్స్, BROOK MITCHELL / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలో మూతపడిన వాలర్‌వాంగ్ థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ టవర్లను కూల్చివేశారు. 2014 వరకు ఈ విద్యుత్కేంద్రం పనిచేసింది. ఇక్కడ ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు.
ఇంగ్లండ్‌లోని మాంచెష్టర్‌లో ఉన్న ఒక ఉద్యానంలో ఎర్ర గులాబీ రెక్కలపై మంచు బిందువులు

ఫొటో సోర్స్, PHIL NOBLE / REUTERS

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌లోని మాంచెష్టర్‌లో ఉన్న ఒక ఉద్యానంలో ఎర్ర గులాబీ రెక్కలపై మంచు బిందువులు
న్యూయార్క్‌లో గ్రోగు బెలూన్ వద్ద సెల్ఫీలు దిగుతున్న ప్రజలు. దీన్ని బేబీ యోధా అని కూడా పిలుస్తారు.

ఫొటో సోర్స్, CARLO ALLEGRI / REUTERS

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లో గ్రోగు బెలూన్ వద్ద సెల్ఫీలు దిగుతున్న ప్రజలు. దీన్ని బేబీ యోధా అని కూడా పిలుస్తారు.
రష్యాలోని తూర్పు సైబీరియా ప్రాంత సఖా రిపబ్లిక్ రాజధాని యాకష్క్‌లో మైనస్ డిగ్రీల చలి నుంచి కాపాడుకోవడానికి నిండా కప్పుకొన్న స్థానికుడు. వచ్చేవారంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు -35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోతాయని అంచనా.

ఫొటో సోర్స్, VADIM SKRYABIN / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రష్యాలోని తూర్పు సైబీరియా ప్రాంత సఖా రిపబ్లిక్ రాజధాని యాకష్క్‌లో మైనస్ డిగ్రీల చలి నుంచి కాపాడుకోవడానికి నిండా కప్పుకొన్న స్థానికుడు. వచ్చేవారంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు -35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోతాయని అంచనా.
కెనడాలోని మానిటోబాలో ధ్రువపు ఎలుగుబంట్ల కొట్లాట

ఫొటో సోర్స్, CARLOS OSORIO / REUTERS

ఫొటో క్యాప్షన్, కెనడాలోని మానిటోబాలో ధ్రువపు ఎలుగుబంట్ల కొట్లాట