You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్-19: కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి కొత్త ఆంక్షల నడుమ యూరప్‌లో నిరసనలు - Newsreel
ఐరోపాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను కట్టడి చేసేందుకు విధిస్తున్న లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.
నెదర్లాండ్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. హేగ్‌లో పోలీసులపైకి నిరసనకారులు బాణాసంచా విసిరారు. ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు.
రోట్రెడామ్‌లో విధ్వంసకర నిరసనల నడుమ పోలీసులు కాల్పులు జరిపిన మరుసటి రోజే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తాజా లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ దేశాల్లో వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
ఐరోపాలో కోవిడ్-19 కేసులు పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తంచేసింది.
ఇక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించకపోతే ఐదు లక్షల మందికిపైగా కోవిడ్-19తో చనిపోయే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హన్స్ కుల్గే బీబీసీతో చెప్పారు.
‘‘మళ్లీ ఇక్కడ కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనావైరస్‌పై పోరాటంలో ఏం చేయాలో మనకు తెలుసు. అందరూ వ్యాక్సీన్లు వేయించుకోవాలి. మాస్క్‌లు పెట్టుకోవాలి’’ అని ఆయన చెప్పారు.
పెరుగుతున్న కోవిడ్-19 కేసులను కట్టడి చేసేందుకు ఐరోపాలోని చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. ఇక్కడ చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి, 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- ‘భారీ వర్షాలతో టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)