కాబుల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు: ఆ మరణాలకు కారణాలేమిటి?

వీడియో క్యాప్షన్, కాబుల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు: ఆ మరణాలకు కారణాలేమిటి?

కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికా మిలటరీ విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రజలు దాన్ని పట్టుకుని, వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులకు ఆ వీడియోలు అద్దం పడుతున్నాయి.

అమెరికా మిలటరీ విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై వెళ్తుండగా వందల మంది దాని వెంట పరుగులు తీయడం, కొందరు విమానాన్ని పట్టుకుని వేలాడడం ఆ వీడియోలలో కనిపిస్తోంది. బీబీసీ ఈ వీడియోలను స్వయంగా ధ్రువీకరించలేదు.

ఓ విమానానికి ఇలాగే వేలాడుతూ అది టేకాఫ్ అయిన తరువాత కింద పడి ఇద్దరు మరణించినట్లు కూడా చెబుతున్నారు. బీబీసీ దీన్ని ధ్రువీకరించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)