You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్: హోటల్ క్వారంటైన్‌లో ఉన్న మహిళలపై వేధింపులు
కరోనా వైరస్ కారణంగా హోటల్లో క్వారంటైన్ అయిన తమను జీ4ఎస్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులు లైంగికంగా వేధించారని నలుగురు యువతులు ‘బీబీసీ’కి చెప్పారు.తాము లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ గార్డు తనతో శృంగారంలో పాల్గొనాలని అడిగారని.. మరో గార్డు కౌగిలించుకుని సెల్ఫీ దిగుదామని అడిగారని వెల్లడించారు.హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంటున్న వారిని నిబంధనలు పాటించేలా చూడటానికి ప్రభుత్వం ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.
ఈ ఆరోపణలపై స్పందించిన జీ4ఎస్ సంస్థ ‘‘మేం మా ఉద్యోగులు నుంచి అత్యుత్తమ క్రమశిక్షణ నియమావళిని ఆశించాం. వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపాం’ అని చెప్పింది.కరోనా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్న దేశాలను యూకే రెడ్ లిస్టులో పెట్టింది. వీటి నుంచి యూకేకి వచ్చే ప్రయాణికులను 10 రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉంచుతోంది.
కేవలం వ్యాయామం కోసం మాత్రమే గది నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తోంది. అలా వెళ్లేటప్పుడు వారితో పాటు గార్డులు ఉంటారు.క్వారంటైన్‌లో ఉన్న ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్లు పెడితే, వాటిని కూడా గార్డులే తెచ్చి అందిస్తున్నారు. భద్రత కోసం ఉంటున్న వారిలో మహిళా గార్డులు తక్కువగా ఉన్నారని క్వారంటైన్‌లో ఉన్న ఏడుగురు మహిళలు తెలిపారు.
కోవిడ్ కారణంగా దుబయిలో పని చేసిన నర్సు మారీ సిడ్వెల్(28) ఇటీవల యూకే తిరిగొచ్చారు. పది రోజల క్వారంటైన్‌లో భాగంగా నాటింగ్హోమ్లోని పెంటాహోటల్లో బస చేశారు. మారీ ఆర్డర్ చేసిన వాటిని ఇద్దరు గార్డులు రెండు సార్లు తీసుకుని వచ్చారు.
తొలుత వచ్చిన గార్డు క్వారంటైన్ నియమాలను పాటించారని మారి చెప్పారు. రెండో సారి వచ్చిన గార్డు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ 'మీకు క్రికెట్ ఆడటం వచ్చా? సెల్ఫీ దిగుదామా?' అని అడిగారని ఆమె చెప్పారు.
అందుకు తాను నిరాకరించగా ఆ గార్డ్ 'నాకు నెగిటివ్. పర్లేదు' అని ఒత్తిడి చేసినట్లు మారీ వివరించారు.ఆ తర్వాత తాను వెనకడుగు వేయగా.. 'నాకు ఓ హగ్ ఇస్తావా?' అని గార్డు అడిగినట్లు మారీ తెలిపారు. ఆ తర్వాత రూమ్ లోపలికి అతను రాబోతుండగా.. భయం వేసి వెంటనే తలుపు మూసేసినట్లు వెల్లడించారు.ఈ విషయమై తాను రిసెప్షన్‌కి ఫోన్ చేసి, ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరగదని వారు హామీ ఇచ్చారని మారీ వివరించారు.
అయితే, గార్డుల వద్ద ఉన్న కార్డులతో వారు ఏ రూమ్లోకైనా వెళ్లడానికి యాక్సెస్ ఉంటుందని తెలిసిన తరువాత రాత్రుళ్లు చాలా భయమేసిందన్నారు మారీ.
‘ఎక్సర్‌సైజ్ నుంచి వస్తుంటే కోరిక తీర్చమన్నాడు’
జింబాబ్వే నుంచి స్వదేశానికి వచ్చిన కేథరిన్ గొడొల్ఫిన్(46)కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
పది రోజుల క్వారంటైన్ కోసం ఆమె హిత్రో బాత్ రోడ్ హాలిడే ఇన్ అనే హోటల్లో బస చేశారు. ఎక్సర్సైజుల కోసం లిఫ్ట్‌లో వెళ్తున్న ఆమెతో ఓ గార్డు కూడా వచ్చాడని కేథరిన్ చెప్పారు. అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు.
మరుసటి రోజు ఎక్సర్సైజులు పూర్తి చేసుకుని లిఫ్ట్‌లో వస్తుండగా, అదే గార్డు తన కోరిక తీర్చాలని కోరాడని చెప్పారు. ఈ విషయమై జీ4ఎస్ కంపెనీకి ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదని వివరించారు.దీనిపై జీ4ఎస్‌ను బీబీసీ సంప్రదించినా, వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అమీ, జానెట్ వీలర్ అనే మహిళలకు కూడా జీ4ఎస్ సిబ్బంది నుంచి ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి.
అమీ, పార్క్ గ్రాండ్ హోటల్ బస చేశారు. 'మీరు అందంగా ఉన్నారు. మనం డేట్‌కు వెళదామా? అని ఓ గార్డు నన్ను అడిగాడు' అని అమీ చెప్పారు. వేరే గార్డు కాపలాగా తన రూమ్ వద్ద ఉన్నా, సదరు వ్యక్తి కూడా వచ్చి అక్కడే నిలబడ్డాడని తెలిపారు.మిల్టన్ కీన్స్‌లోని మారియట్ హోటల్లో బస చేసిన జానెట్ వీలర్‌కి తన రూమ్ మారాల్సిన అవసరం కలిగింది. అలా మారే సమయంలో ఆమె 20 నిమిషాల పాటు ఓ గార్డుతో పాటు కారిడార్‌లో వెయిట్ చేశారు.
'మీకు పెళ్లయిందా? మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? మీకు నల్లజాతీయులంటే ఇష్టమేనా?' అని గార్డు ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందన్నారు.
సెక్యూరిటీ గార్డులతో తమకు ఎలాంటి సంబంధం లేదని హోటల్ యాజమాన్యాలు బీబీసీకి తెలిపాయి.
వాళ్లను హెల్త్ అండ్ సోషల్ కేర్ వారు కాంట్రాక్టుకి తీసుకున్నారని వివరించాయి.
పార్క్ గ్రాండ్, మారియటల్, రాడిసన్ హోటల్స్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించాయి. ఈ సంఘటనలపై విచారణ చేయాలని జీ4ఎస్‌ను కోరినట్లు వివరించాయి.
ఇవి కూడా చదవండి:
- రెండు వేల ఏళ్ల కిందటి ‘పురాతన కంప్యూటర్'.. యాంటీకిథెరా గుట్టు విప్పుతున్నారా?
- ఆంధ్రప్రదేశ్: అధికార పార్టీ నేతలపై ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- డిజిటల్ ఫోటో ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో మీ ఫోటోల సీక్రెట్ డేటా తెలిసిపోతుందని మీకు తెలుసా?
- చేతన్ సకారియా: టెంపో డ్రైవర్ కుమారుడు ఇండియన్ క్రికెట్ టీమ్ దాకా ఎలా వచ్చాడు?
- జార్జ్ ఫ్లాయిడ్ హంతకునికి 22 ఏళ్ల జైలు శిక్ష
- బ్రెజిల్ అధ్యక్షుడే బంగారం స్మగ్లర్లకు సహకరిస్తున్నారా? అమెజాన్ అడవుల్లో గోల్డ్ మైనర్లు ఎందుకు రెచ్చిపోతున్నారు?
- ఫోన్ చూస్తూ నడుస్తుంటే తల పైకెత్తమని హెచ్చరించే యాప్
- కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే పత్యం చేయాలా... డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పని మాట యాడ్స్‌లో ఎందుకొచ్చింది?
- 'ఇరాన్ మా పర్షియన్ జర్నలిస్టులను వేధిస్తోంది' అంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బీబీసీ
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)