You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శిరీష బండ్ల: ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి
ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోంది.
దీనిలో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు మూలాలున్న యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు.
ఈ అంతరిక్ష యానం కోసం వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమనౌకను సిద్ధంచేసింది. ముఖ్యంగా అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం దీన్ని అభివృద్ధి చేసింది.
ఈ రాకెట్లో అంతరిక్షం వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌కు అమెరికాకు చెందిన ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీచేసింది.
దీంతో ఈ నెల 11న ప్రయోగం చేపట్టేందుకు వర్జిన్ గెలాక్టిక్ సిద్ధమవుతోంది. ‘‘వాతావరణం అనుకూలించకపోతే లేదా ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ఈ ప్రయోగం కొన్ని రోజులు వాయిదా పడుతుంది. కానీ తప్పకుండా ప్రయోగం జరుగుతుంది’’అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా ఈ నెల 20న అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపడుతోంది.
ఇవి కూడా చదవండి:
- చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వందేళ్లు: తమతో పెట్టుకుంటే 'ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే' అన్న జిన్‌పింగ్
- హీట్‌వేవ్: అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు ప్రాణాలు తీస్తాయా? ఏం చేస్తే ప్రమాదం నుంచి బైటపడొచ్చు?
- సంచయిత, అశోక్ గజపతి రాజు: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి విషయంలో ఇన్ని వివాదాలు ఎందుకు?
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- ‘వేధింపులు భరించలేకపోతున్నాం, ఈ ఇల్లు అమ్మేస్తాం’ అని ఒక కులం వాళ్లు ఎందుకు పోస్టర్లు అంటించారు?
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)