You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎమ్మా కరొనెల్ ఎస్పూరో: నింగి నుంచి నేలకు పడిపోయిన ఓ డ్రగ్ మాఫియా డాన్ భార్య కథ
- రచయిత, తారా మెకల్వీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎమ్మా కరొనెల్ ఎస్పూరో. న్యూయార్క్‌లో ఆమెది విలాసవంతమైన జీవితం. డ్రగ్ గాంగ్‌స్టర్, ఖ్వాకిన్ గూజ్‌మెన్ అలియాస్ ఎల్ చాపోను పెళ్లి చేసుకోవడం వల్లే ఆమెకు అంత వైభవం వచ్చిందని చెప్పుకునేవారు.
తర్వాత ఎమ్మా కరొనెల్ ఎన్సూరోను అరెస్ట్ చేశారు. వర్జీనియాలోని ఒక జైల్లో పెట్టారు.
అయితే, డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యానికి మహారాణిలా వెలిగిన ఆమె ఎందుకు జైలుకు వెళ్లారు. అసలు ఏమైంది?
వర్జీనియా అలెగ్జాండ్రాలోని విలియమ్ ట్రజ్డేల్ అడల్ట్స్ నిర్బంధ కేంద్రం కిటికీలు ఇటుకంత ఖాళీలో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటాయి.
ఇదే జైలులో ఏకాంతంగా ఉంచే ఒక చిన్న సెల్‌లో ఎమ్మా కరొనెల్ ఎస్పూరో ఉన్నారు.
ఆ చిన్న సెల్‌లో ఎమ్మా ప్రస్తుతం రొమాంటిక్ నవలలు చదువుతూ టైంపాస్ చేస్తున్నారని ఆమె వకీల్ మెరిగిల్ కొలోన్ మీరో చెప్పారు.
ఈ జైలు జీవితం ఎమ్మా గత జీవితానికి పూర్తి భిన్నంగా ఉంది.
ఆమె కొన్ని నెలల క్రితం వరకూ 'ఎల్ చాపో గూజ్‌మన్' అనే బ్రాండ్‌తో బట్టల వ్యాపారం చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
నిజానికి మెక్సికోలో ఎల్ చాపో, ఎమ్మా కరొనెల్ జంటను స్టయిల్ ఐకాన్స్‌గా భావిస్తారు. వాళ్ల కూతురు కూడా తన తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించుకుంటూ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నారు.
ఎమ్మా భర్త గూజ్‌మెన్‌పై 2019లో న్యూయార్క్ కోర్టులో విచారణలు జరుగుతున్నప్పుడు నేను ఆమెతో మాట్లాడాను. ఆ సమయంలో ఆమె ఆభరణాలు, ఖరీదైన గడియారం పెట్టుకుని ఉన్నారు.
తర్వాత ఈ ఏడాది మొదట్లో 31 ఏళ్ల కరొనెల్‌ను వర్జీనియాలోని డలాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.
సినాలోవా కార్టెల్ నిర్వహణలో డ్రగ్ కార్యకలాపాల్లో తన భర్తకు సాయం చేసిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. 64 ఏళ్ల గూజ్‌మన్ ప్రస్తుతం కొలరాడోలోని సూపర్‌మాక్స్ జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్నారు.
కరొనెల్ కొకైన్ స్మగ్లింగ్‌కు కుట్ర పన్నారని, 2015లో మెక్సికో జైలు నుంచి పారిపోవడానికి భర్త ప్లాన్ వేసినపుడు ఆయనకు సహకరించారని చెబుతున్నారు.
ఎమ్మా వ్యక్తిగత జీవితం అంతా ఒక మోసగాడైన భర్త, అతడి ప్రియురాలు, ఒక నేర విభాగం చుట్టూ తిరుగుతుంది. అయితే ఎమ్మా కథ ద్వారా డ్రగ్ కార్టెల్స్ రహస్య ప్రపంచం, అందులోని మహిళల గురించి చాలా వరకూ తెలుస్తుంది.
ఆమె కేసు ఇంకా విచారణకు రాలేదు. కరొనెల్ మీద మోపిన అభియోగాలు రుజువైతే ఆమెకు కూడా జీవితఖైదు పడవచ్చు.
ఎమ్మా దోషి, నిర్దోషి అనే విషయం పక్కన పెడితే, ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ఒక పబ్లిక్ ఫిగర్‌గా, వ్యాపారవేత్తగా నిలిచారని డ్రగ్ స్మగ్లింగ్ ప్రపంచం గురించి తెలిసిన నిపుణుల చెబుతున్నారు.
భర్త గూజ్‌మెన్ డ్రగ్ కార్టెల్ నడుపుతున్నప్పుడు, అతడి దగ్గరికి ఎవరు వెళ్లాలి అనేది పూర్తిగా ఎమ్మా చేతుల్లోనే ఉండేది.
"సాధారణంగా డ్రగ్ స్మగ్లర్ల భార్యలు చాలా రొమాంటిక్‌గా ఉండడం చూస్తుంటాం. వాళ్లకు ఏ పనీ ఉండదు. కానీ, కరొనెల్ దానికి భిన్నంగా ఉండేవారు. మహిళలు కూడా పవర్ తమ చేతుల్లోకి తీసుకోగలరని ఆమె నిరూపించారు" అని శాన్‌డియోగో కాలిఫోర్నియా యూనివర్సిటీ స్కాలర్ సెసిలియా ఫార్ఫన్ మెండెజ్ చెప్పారు.
కానీ ఒక డ్రగ్ కార్టెల్‌లో పవర్ చేజిక్కించుకోవడానికి పక్కనే ప్రమాదాలు కూడొ పొంచి ఉంటాయి.
"ఒకరు మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉన్నప్పుడు, వారు చివరకు పట్టుబడడమో, లేక ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది" అని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ మాజీ స్పెషల్ ఏజెంట్ డెరెక్ మాల్టజ్ అన్నారు.
ఎమ్మా సొంతంగా ఒక ఫ్యాషన్ కంపెనీ తెరవాలనే ప్లాన్‌తో చాలా సాహసం చూపించారు. కానీ ఆమె చుట్టూ పోలీసులు పట్టు బిగిస్తూ వెళ్లారు.
మాల్టజ్ చెప్పినట్టు ఆమె ఆశల పునాదులు కదులుతూ వచ్చాయి. చివరకు ఆమె కట్టుకున్న కోట కూలిపోయింది.
ఆధిపత్యం కోసం హింస
కరొనెల్ భర్త కేసు విచారణ జరుగుతున్న సమయంలో బ్రూక్లిన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో కాబేజీ స్నాక్ తింటున్నారు. ఆమె కాఫెటేరియాలో తన స్నేహితులతో కూర్చుని తల్లుల నుంచి తప్పించుకోడం ఎలా అనే విషయంపై జోకులేస్తున్నారు.
"ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ.. నాకు తెలిసిన ఎమ్మా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది" అని ఆమె వకీల్ మీరో చెప్పారు.
ఎమ్మాకు అమెరికా, మెక్సికో పౌరసత్వాలూ ఉన్నాయి. ఆమె 17 ఏళ్ల వయసులో గూజ్‌మెన్‌ను కలిశారు. తర్వాత వారి పెళ్లయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. మారియా ఖ్వాకీనా, ఎమాలీ. భర్త కేసు విచారణ సమయంలో కరొనెల్ దాదాపు రోజూ కోర్టుకు వచ్చేవారు.
"కరొనెల్ ఒక సినలోవా అప్సరసలా ఉండేవారు" అని మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ మీద అధ్యయనం చేస్తున్న రోమెన్ లి కూర్ గ్రాండ్‌మైసన్ అంటారు.
ఎర్రటి లిప్‌స్టిక్, వజ్రాల ఆభరణాలు, టైట్ జీన్స్‌తో కనిపించే కరొనెల్‌కు ఒక బ్యూకోనా ఇమేజ్ వచ్చింది. బ్యుకోనా అంటే డ్రగ్స్ వ్యాపారం చేసే గ్యాంగ్‌స్టర్ ప్రియురాలుగా ఉండే మహిళలు.
జార్జ్ మేసన్ యూనివర్సిటీలోని కోరె కబేరా కూడా మెక్సికోలోని సినోవోవా గురించి అధ్యయనం చేశారు. ఎల్ చాపో కార్టిల్ నడిపింది ఇక్కడే.
బ్యుకోనా అనే మాట గురించి చెప్పిన ఆమె, "వాళ్లు చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటారు. లక్షల విలువ చేసే పర్సులు వాడతారు. వాళ్లు వాడే ప్రతి ఒక్కటీ చాలా ఖరీదైనదిగా ఉంటుంది. కరొనెల్ పక్కాగా అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అందం ముఖ్యం కాబట్టి ఆమె ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారు" అన్నారు.
ఆకర్షణీయమైన ఆమె ఆ ఇమేజ్ ఎల్ చాపో నడిపే కార్టెల్‌లో చీకటి వాస్తవాలకు పూర్తిగా భిన్నంగా ఉండేది.
గూజ్‌మెన్ అక్రమ డ్రగ్ మార్కెట్ మీద తన పట్టు నిలుపుకోవడానికి హింసకు పాల్పడ్డారు. ఫలితంగా ఆయన, ఆయన కుటుంబం మరింత సంపన్నులుగా మారారు. 2006 నుంచి ఇప్పటివరకూ మెక్సికోలో 3 లక్షల మందికి పైగా చనిపోయారు. ఆ సంవత్సరం నుంచి ప్రభుత్వం కార్టెల్స్‌ను అంతం చేసే ఆపరేషన్ ప్రారంభించింది.
మాదకద్రవ్యాలకు సంబంధించిన జరిగిన హింసాత్మక ఘర్షణల్లో గూజ్‌మెన్ శత్రువులతోపాటూ అతడి సన్నిహితులు కూడా బాధితులు అయ్యారు. ఆయన ఒక ప్రియురాలి శవం కారు డిక్కీలో దొరికింది. ఆ హత్య ఆయన ప్రత్యర్థులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
భర్త వెన్నంటి నిలిచిన కరొనెల్
సుదీర్ఘ కాలం పాటు గూజ్‌మెన్ ప్రియురాలిగా ఉన్న శాంచెజ్ లోపెజ్ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఆమెను 2017 జూన్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణల్లో అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు.
నేరం అంగీకరిస్తే, నీకు పదేళ్ల శిక్షే పడుతుందని పోలీసులుఆమెకు చెప్పారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన శాంచెజ్ ఒక ఒప్పందం ప్రకారం ఈ కేసు దర్యాప్తులో ప్రాసిక్యూషన్‌కు సహకరించారు.
ఖైదీలు ధరించే నీలి దుస్తులు వేసుకున్న శాంచెజ్ కోర్టులో తమ ప్రేమకు సంబంధించిన విషాలు, కార్టెల్ లీడర్‌గా గూజ్‌మెన్ చేసిన నేరాల గురించి కోర్టుకు చెప్పారు.
శాంచెజ్ అప్పుడు చాలా బెదిరిపోయి కనిపించారు. మాటిమాటికీ కళ్లు ఆర్పారు. ఆమెకు కాస్త దూరంలోనే కూర్చున్న గూజ్‌మెన్ చాలా కలవరంగా కనిపించారు. మాటిమాటికీ చేతి గడియారం వైపు చూసుకుంటూ ఉండిపోయారు.
ఆ సమయంలో, కరొనెల్ రెండో వరుసలో కూర్చుని ఉన్నారు. తన పొడవాట జుట్టును వేలితో రింగులు చుడుతున్నారు. ఆమె ఆ రోజు అక్కడ తన భర్త ఎలాంటి జాకెట్ వేసుకున్నాడో, అలాగే ఉన్న వెల్వెట్ జాకెట్‌లో కనిపించారు.
ఒకేలాంటి జాకెట్లు వేసుకోవడం వాళ్ల బలమైన బంధం గురించి చెబుతుంది. శాంచెజ్ సాక్ష్యం ఇచ్చిన తర్వాత రోజు తన భర్తలాంటి జాకెట్ ధరించిన కరొనెల్ ఆమెకు ఒక సందేశం ఇవ్వాలనుకుంది అని గూజ్‌మెన్ లాయర్ విలియమ్ పర్పూరా చెప్పారు.
"నువ్వెన్నైనా చేసుకో, గూజ్‌మెన్ నావాడు" అని ఆమె శాంచెజ్‌కు చెప్పాలనుకుంది" అని పర్పూరా తెలిపారు.
సాక్ష్యం ఇచ్చిన తర్వాత కోర్టు శాంచెజ్‌ను తిరిగి జైలుకు పంపింది. కరొనెల్ అక్కడనుంచి ఒక డిన్నర్ కోసం న్యూయార్క్ వెళ్లారు.
కానీ కొన్నాళ్లకే ఈ ఇద్దరు మహిళల జీవితాలు తారుమారయ్యాయి. శాంచెజ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఆమె స్వేచ్ఛగా ఉంది. కానీ కరొనెల్ జైలు ఊచల వెనక ఉన్నారు. ఆమెకు బెయిల్ కూడా దొరకడం లేదు.
భర్త కేసు విచారణ సమయలో ఆమె తన జీవనసైలిని అలా ప్రదర్శించడం చాలా మందికి నచ్చలేదు.
కరొనెల్‌ను చాలామంది ఒక 'తెలివితక్కువ మహిళ'లా చూశారు అని భద్రతా విశ్లేషకులు గ్రాండ్‌మేసన్ అన్నారు.
అయితే, శాంచెజ్ మాత్రం అలా అనుకోలేదు. ఆమె వకీల్ హైదర్ షోనర్ కరొనెల్ జైలుకెళ్లారనే విషయం చెప్పినపుడు ఆమె సంతోషించలేదు.
"కరొనెల్ జైలుకెళ్లినందుకు శాంచెజ్ బాధపడింది. మరో తల్లి తన పిల్లలకు దూరమైందని ఆమెకు అనిపించింది" అని ఆమె లాయర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జూహీచావ్లా 5జీపై ఎందుకు కోర్టుకెళ్లారు.. ఈ టెక్నాలజీపై అంత ఆందోళన ఎందుకు
- ‘‘వైట్ ఫంగస్’’: ఔషధాలకు లొంగని ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి
- ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)