You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- రచయిత, జోనాథన్ అమోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంగారక గ్రహంపైకి నాసా పంపించిన 'పెర్సీవరెన్స్' రోవర్‌లో ఉన్న ఒక పరికరం అక్కడి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ తయారు చేయగలిగింది.
మార్స్‌పై నాసాకు ఇది రెండవ విజయం.
ఇంతకుముందు, సోమవారం ఒక చిన్న హెలికాప్టర్ మార్స్‌పై గాల్లోకి లేచి కొద్ది నిముషాలపాటు నిలకడగా ఎగిరింది.
రోవర్‌లో ఉండే మోక్సీ (మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్) అనే చిన్న పరికరం 5 గ్రాముల ఆక్సిజన్ తయారుచేసింది.
ఇది మార్స్‌పై ఒక వ్యోమగామి సుమారు 10 నిముషాల పాటూ ఊపిరి పీల్చుకోవడానికి సరిపోతుంది.
మోక్సీలాంటి పరికరాలను భారీ స్థాయిలో తయారుచేయగలిగితే భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి వెళ్లే వ్యోమగాములు భూమి నుంచి ఆక్సిజన్ మోసుకు వెళ్లకుండా అక్కడే తయారుచేసుకోగలిగే అవకాశం ఉంటుందని నాసా భావిస్తోంది.
అంగారక గ్రహంపై వాతావరణంలో అధికంగా 96 శాతం గాఢత కలిగిన కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ కేవలం 0.13 శాతం ఉంటుంది. భూమిపై ఉన్న ఆక్సిజన్‌తో పోలిస్తే అది కేవలం 21 శాతం మాత్రమే.
మోక్సీ అక్కడ ఉన్న కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేసి మిగిలిన కార్బన్ మోనాక్సైడ్‌ను బయటకు విడుదల చేసింది.
మోక్సీ సామర్థ్యాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇది గంటకు 10 గ్రాముల వరకూ ఆక్సిజన్ తయారుచేయగలదని అంచనా వేస్తున్నారు.
"మోక్సీ మరో ప్రపంచంలో ఆక్సిజన్ తయారుచేయగలిగిన మొదటి పరికరం మాత్రమే కాదు, భూమిని దాటి మానవులు ఊపిరి పీల్చగలిగే అవకాశాన్ని ఇచ్చిన తొలి సాంకేతిక పరిజ్ఞానం" అని నాసా డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ ట్రూడీ కార్టెస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు... ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకే రోజు 34 వేల మందికి వైరస్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)