You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించడానికి డొమెనికా సిద్ధంగా ఉంది: ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’ ప్రధాని
డొమెనికాలో పట్టుబడిన భారత వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తామని ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’ ప్రధాని గాస్టన్ బ్రౌన్ అన్నారు.
మెహుల్‌ను తిరిగి ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’కు పంపించకుండా నేరుగా భారత్‌కు అప్పగించాలని ఆయన డొమెనికాకు సూచించారు.
మెహుల్ చోక్సీ రూ.13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో నిందితుడు. ఆదివారం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి ఆయన కనిపించకుండాపోయారు. అప్పటి నుంచి స్థానిక పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.
మెహుల్ ఒక పడవలో అక్రమంగా డొమెనికా వెళ్లుంటారని బ్రౌన్ అన్నారు.
వార్తా ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన బ్రౌన్.. "మా దేశం మెహుల్ చోక్సీని రానివ్వదు. ఆయన ఈ దీవి నుంచి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశారు. డొమెనికా ప్రభుత్వం, అధికారులు మాకు సహకరిస్తున్నారు. ఆయన్ను అప్పగిస్తామని మేం భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాం" అన్నారు.
భారత్‌తో సంప్రదిస్తున్న డొమెనికా అధికారులు
మెహుల్ చోక్సీ జనవరి 2018 మొదటి వారంలో భారత్ నుంచి పారిపోయే ముందు 2017లో కరిబియన్ దేశాల్లో ఒకటైన ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. ఇన్వెస్ట్‌మంట్ ప్రోగ్రాం కింద ఆ దేశంలో పౌరసత్వం తీసుకోవచ్చు.
"డొమెనికా చోక్సీని తిరిగి పంపించడానికి సిద్ధంగా ఉంది. కానీ, మేం ఆయన్ను మా దేశంలోకి అనుమతించం. ఇక్కడి పౌరుడిగా ఆయనకు చట్టపరమైన, రాజ్యాంగబద్ధ రక్షణ ఉండడంతో మేం భారత్‌కు అప్పగించలేం. అందుకే మా దేశానికి పంపించవద్దని నేను డొమెనికా ప్రధాని, అధికారులను కోరాను" అన్నారు బ్రౌన్.
"మెహుల్‌ను అదుపులోకి తీసుకుని భారత్‌కు అప్పగించడానికి ఏర్పాట్లు చేయాలని నేను కోరుతున్నాను. ఆయన డొమెనికా పౌరసత్వం తీసుకున్నాడని నేను అనుకోవడం లేదు. అందుకే, ఆయన్ను అప్పగించడానిడి డొమెనికాకు ఎలాంటి సమస్యా ఉండదు" అని చెప్పారు.
చోక్సీ డొమెనికాలో దొరికారని ఆయన లాయర్ బుధవారం రాత్రి ధ్రువీకరించినట్లు ఇంతకు ముందు ఏఎన్ఐ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)